• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

admin by admin
January 30, 2023
in Movies
0
0
SHARES
99
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఈ మధ్య షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ను పున:ప్రారంభించి, కొన్ని రోజుల పాటు వరుసగా కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం.. మరోవైపు ఒకదాని తర్వాత ఒకటి కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు ఇవ్వడం, ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం.. ఇలా గత రెండు నెలలుగా సందడి సందడిగా ఉంది వ్యవహారం. ఇంతకుముందు ప్రకటించిన సుజీత్ సినిమాకు ఈ రోజు ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ వేడుకను నభూతో అన్న రీతిలో నిర్వహించారు.

సినిమా ప్రారంభోత్సవం కోసమే ఒక భారీ సెట్ వేయడం అన్నది అరుదైన విషయం. పవన్‌తో సినిమా అంటే నిర్మాతలు ఎంత ప్రత్యేకంగా భావిస్తారో చెప్పడానికి ఇది రుజువు. ఇక పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతుండటం.. ఒకప్పుడు ‘గబ్బర్ సింగ్’ సినిమా షో చూసి పవర్ స్టార్ అంటూ నినాదాలు చేసుకుంటూ బయటికి వచ్చిన సుజీత్ ఇప్పుడు ఆయన పక్కన నిలబడి సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొనడం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ఇక ఈ వేడుకకు క్యాజువల్ డ్రెస్‌లో వచ్చినప్పటికీ పవన్ సూపర్ స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువ అవుతోంది. మొత్తంగా ఈ రోజు పవన్ అభిమానులు సంబరాల మోడ్‌లో ఉన్నారన్నది వాస్తవం.

సోషల్ మీడియా ఈ సినిమా విశేషాలతోనే ఊగిపోతోంది. ఐతే అంతా బాగుంది కానీ.. ఒకదాని తర్వాత ఒక సినిమాకు ప్రారంభోత్సవం జరిపిస్తున్న పవన్.. వీటి షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటాడు.. దేనికి ఎలా డేట్లు సర్దుబాటు చేస్తాడు.. ఎన్నికలకు అటు ఇటుగా ఏడాదే సమయం ఉన్న నేపథ్యంలో పార్టీకి ఎలా న్యాయం చేస్తాడు.. అసలు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకైనా క్లారిటీ ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుజీత్ సినిమా త్వరలోనే మొదలవుతుందని అంటున్నారు కానీ.. ‘హరిహర వీరమల్లు’ పూర్తి కాకుండా, హరీష్ శంకర్ చిత్రం మొదలవకుండా.. మరోవైపు ‘వినోదియ సిత్తం’ను పట్టాలెక్కించకుండా దీనికి ఎలా న్యాయం చేస్తాడో అర్థం కావడం లేదు.

Tags: film careerhappypawan kalynapawan's fanssujith movie
Previous Post

తారక రత్నకు ముగిసిన 48 గంటల డెడ్ లైన్

Next Post

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్ ఈ స్పీడేంటి సామీ !

March 21, 2023
Top Stories

చిరు, చెర్రీలతో అమిత్ షా ‘నాటు’ భేటీ

March 18, 2023
Movies

వేసవి.. వేడి మొదలవుతుందా?

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Load More
Next Post

పట్టాభికి వల్లభనేని వంశీ షాక్

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra