పెట్రోల్‌పై కేంద్ర సుంకాలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత పెట్రోలు, డీజిలుపై 9 రూపాయలు, 8 రూపాయలు తగ్గిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ట్వీట్లో మోడీ తగ్గింపు ఎలా ఉంటుందో సూక్ష్మంగా షార్ప్ గా చెబుతూ మోడీని గిల్లాడు.
ఫస్ట్ టైం మోడీ చేసిన పనికి మోడీ ఏ మాత్రం క్రెడిట్ తీసుకోలేకపోయిన సందర్భం ఇదే. ఇంధన ధరలు తగ్గడం కేవలం వైట్‌వాష్ అని ఆయన రాహుల్ అన్నారు. ఆయన ట్వీట్ ఒకసారి చూడండి.
Petrol Prices
May 1, 2020: ₹69.5
Mar 1, 2022: ₹95.4
May 1, 2022: ₹105.4
May 22, 2022: ₹96.7Now, expect Petrol to see ‘Vikas’ in daily doses of ₹0.8 and ₹0.3 again.
Govt must stop fooling citizens. People deserve genuine relief from record inflation.
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2022
వరుసగా పెంచారు. ఇపుడు తగ్గించారు. ఇక నుంచి పెట్రోల్ మళ్లీ ₹0.8 మరియు ₹0.3 రోజువారీ డోస్‌లలో పెంచుతారు. మీ నాటకాలు తెలియనిది ఎవరికి అన్నట్టు వ్యంగాస్త్రాలు విసిరారు రాహుల్.
పౌరులను మోసం చేయడం ప్రభుత్వం ఆపాలి. రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం నుండి ప్రజలు నిజమైన ఉపశమనం పొందాలి. అని రాహుల్ గాంధీ అన్నారు.
మోడీ రెండోసారి పీఎం అయ్యాక పెంచిన దానితో పోలిస్తే ఇపుడు తగ్గించింది నామమాత్రం అన్నది కాంగ్రెస్ వాదన. దేశ ప్రజల వాదన కూడా అదే.
ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారతదేశం నిత్యావసరాల ధరలలో కొత్త రికార్డులను చూస్తుండగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో సహా పలు కీలక ప్రకటనలు చేశారు. LPG సిలిండర్‌కు ₹200 సబ్సిడీ – ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు – అందించబడుతుందని, సంవత్సరానికి గరిష్టంగా 12 సిలిండర్లకు సబ్సిడీ అందించబడుతుందని ఆమె తెలిపారు.
ఇంధన ధరల్లో మార్పు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. “దీని వల్ల లీటరుకు పెట్రోల్ ధర ₹9.5 మరియు డీజిల్ ధర లీటరుకు ₹7 తగ్గుతుంది. ఇది ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు ₹ 1 లక్ష కోట్ల ఆదాయాన్ని తగ్గిస్తుందన్నారు.