Listen to the number – 136!@DKShivakumar ji led his team like Arjun without a doubt!! pic.twitter.com/4zg2KLNUAe
— Sujata Paul – India First (Sujata Paul Maliah) (@SujataIndia1st) May 13, 2023
గెలుపు జీవన్మరణ సమస్యగా మారిన వేళలో.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవటానికి మించిన సంతోషం మరొకటి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. వరుస పెట్టి వచ్చి పడుతున్న ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పార్టీకి.. ఒక బలమైన విజయం.. అది కూడా ప్రత్యర్థి దిమ్మ తిరిగిపోయేలాంటి గెలుపు ఒకటి తమ ఖాతాలో పడాలని కోరుకుంటున్న వేళ.. కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైన అధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.
ఈ విజయంలో ప్రధాన వాటా ఎవరిది? అన్నప్పుడు వేళ్లు రెండు సిద్దరామయ్య.. డీకే శివకుమార్ వైపు చూపిస్తాయి. పాలనా అనుభవం.. పెద్ద మనిషిగా పేరు ప్రఖ్యాతులు.. లాంటివి సిద్దకు సొంతమైతే.. దూకుడు నేతగా.. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు.. తాను కష్టాలపాలు అయినా.. చివరకు తిహార్ జైల్లో నెలల తరబడి ఉంచినా.. వెనక్కి తగ్గక పార్టీ కోసం పోరాడిన శివ కుమార్ కనిపిస్తారు. ఇలా ఇద్దరు ముఖ్యనేతలు కర్ణాటక కాంగ్రెస్ విజయంలో కీలకభూమిక పోషించారు. ఈ ఇద్దరు అగ్రనేతలు కలిసికట్టుగా పని చేయకపోతే.. ఈ గెలుపు సాధ్యమయ్యేది కాదు.
ఇదే.. ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానికి చిక్కుగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తిహార్ జైలుకు వచ్చి మరీ పలుకరించి.. పరామర్శించిన సోనియాకు విధేయుడిగా నిలుస్తారు శివకుమార్. కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో గెలిపిస్తానని.. కర్ణాటకలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తానని పార్టీ అధినేత్రి సోనియాకు మాటిచ్చి మరీ.. గెలిపించిన శివకుమార్ ఇప్పుడు సీఎం అవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
ఇక్కడే మరోఆసక్తికర విషయాన్ని వెల్లడించాలి. డీకే శివకుమార్ పుట్టిన రోజు మే 15. ఇదే రోజున.. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. దీంతో.. డీకే పుట్టిన రోజున సోనియాగాంధీ ఆయనకు స్వీట్ న్యూస్ చెబుతారా? ఆయన పుట్టిన రోజుకు తిరుగులేని కానుకను ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్న వేళలో అండగా నిలిచిన వ్యక్తి ముఖ్యమా? ప్రభుత్వాధినేతగా అనుభవం ఉన్న సిద్ద అవసరమా? అన్నది గాంధీ ఫ్యామిలీ తేల్చుకోవాల్సిన పరిస్థితి. డీకే శివకుమార్ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.. ఆయన చిరకాల కోరికను సోనియగాంధీ తీరుస్తారా? లేదా? అన్నదిప్పుడు ఉత్కంటగా మారింది.