టాలీవుడ్‌ను మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రాడిసన్ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు భాగస్వామ్యం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన కేదార్ శెలగంశెట్టి పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
లిపి గణేష్ అనే నటితో పాటు ఇంకొందరు సినిమా వాళ్ల పేర్లు కూడా ఈ కేసులో నలుగుతున్నాయి. ఐతే వీటన్నింటికీ మించి ఇప్పుడు ఓ సినీ ప్రముఖుడి పేరు చర్చనీయాంశం అవుతోంది. ఆ పేరే.. జాగర్లమూడి క్రిష్. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఎనిమిదో నిందితుడిగా క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు చేర్చడం సంచలనం రేపుతోంది.
క్రిష్‌కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా డ్రగ్స్ కేసులోకి ఆయన పేరు రావడం ఆశ్చర్యం కలిగించేదే. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ స్టేట్మెంట్లో క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. పార్టీ జరిగిన టైంలో గజ్జెల వివేకానందతో కలిసి క్రిష్ అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. ఐతే డ్రగ్స్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని.. తాను రాడిసన్ హోటల్‌కు కొందరు మిత్రులను కలిసేందుకు వెళ్లానని క్రిష్ చెబుతున్నారట.
తాను అక్కడ ఆ రోజు అరగంట మాత్రమే ఉన్నానని.. 6.45 ప్రాంతంలో తిరిగి ఇంటికి బయల్దేరానను అన్నది క్రిష్ వెర్షన్. బహుశా పోలీసులు రైడ్‌కు వెళ్లిన సమయంలో క్రిష్ అక్కడ ఉండడం.. క్రిష్ స్నేహితుడు ఈ కేసులో చిక్కుకోవడం వల్ల ఆయనకు కూడా ఈ మరక అంటి ఉండొచ్చు. క్రిష్ లాంటి వ్యక్తికి డ్రగ్స్‌తో సంబంధం ఉందంటే జనం నమ్మరన్నది వాస్తవం.