టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో క్రిష్ జాగర్లమూడి ఒకరు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విభిన్నమైన చిత్రాలతో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్న క్రిష్.. ప్రస్తుతం `ఘాటీ` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. క్రిష్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. క్రిష్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడట. 2016 ఆగష్టు 7న రమ్య అనే యువతిని క్రిష్ ముందుగా వివాహం చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ నుంచి ఎందరో సెలబ్రిటీలు క్రిష్ వివాహానికి హాజరు అయ్యారు. అయితే క్రిష్, రమ్యల దాంపత్య జీవితం అనుకున్నంత సవ్యంగా సాగలేదు. పెళ్లైన కొన్నేళ్లకే మస్పర్థలు తలెత్తడంతో.. 2021లో విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న క్రిష్.. ఫైనల్ గా మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఓ లేడీ డాక్టర్ తో త్వరలోనే క్రిష్ వివాహం జరగనుందని.. వచ్చే వారం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించబోతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇక క్రిష్ తో ఏడడుగులు వేయబోతున్న సదరు మహిళలకు గతంలో ఒకసారి పెళ్లై విడాకులు అయ్యాయట. మరియు ఆమెకు ఇప్పుడు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే క్రిష్ తన రెండో పెళ్లిపై నోరు విప్పాల్సిందే.