• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తెలుగువారిపై హీరోయిన్ దారుణ వ్యాఖ్యలు

admin by admin
November 5, 2024
in Politics, Trending
0
0
SHARES
92
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తమిళ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన కస్తూరి తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారి గురించి దారుణమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. కస్తూరి తాజాగా బ్రాహ్మణ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా బ్రాహ్మణుల హక్కుల గురించి మాట్లాడింది. వాళ్లు దేనికీ భయపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అవసరం లేని విధంగా ఆమె తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారి ప్రస్తావన తెచ్చింది.

300 ఏళ్ల కిందట తమిళనాట రాజులకు శృంగార సేవలు అందించడానికి వచ్చిన వేశ్యల కుటుంబాలన్నీ తెలుగు వారివే అని.. వాళ్లే ఇప్పుడు తమిళ నేల తమది అంటున్నారని.. అలాంటిది బ్రాహ్మణులు ఎప్పట్నుంచో తమిళనాట కీలకంగా ఉన్నారని.. వాళ్లు తమిళనాడు తమది అనడానికి సందేహించాల్సిన అవసరం లేదని.. వాళ్లు తమ హక్కుల కోసం పోరాడాలని కస్తూరి వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శతాబ్దాల నుంచి తమిళనాడులో స్థిరపడి ఆ రాష్ట్రంలో అంతర్భాగంగా మారిన తెలుగు వారి గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు దారుణమంటూ ఆమె మీద మండి పడుతున్నారు.

నటిగా కస్తూరి కెరీర్ ఎప్పుడో ముగియగా.. కొన్నేళ్ల కిందట క్యారెక్టర్ రోల్స్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఐతే ఆమె కెరీర్ తిరిగి ఊపందుకోకపోవడంతో అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాగా ఇప్పుడు ఆమెకు రాజకీయాల మీద మనసు మళ్లినట్లుందని.. అందుకే ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తోందని ఆమె తీరును దుయ్యబడుతున్నారు. ఈ కామెంట్లపై తమిళనాట స్థిరపడ్డ తెలుగు వారు ఆందోళన బాట పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాట కీలకమైన ఓటు బ్యాంకుగా మారిన తెలుగు వారి విషయంలో అక్కడి రాజకీయ పార్టీలు కూడా ఎలా స్పందిస్తాయో చూడాలి.

Tags: Actress KasthuriKasthuriKasthuri Shankartamil naduTelugu peopleTelugu states
Previous Post

‘జై హనుమాన్‌’ లో రానా కూడా?

Next Post

11 ఏళ్ల కొడుకు ఉన్న డాక్ట‌ర్ తో డైరెక్ట‌ర్ క్రిష్ రెండో పెళ్లి నిజ‌మేనా..?

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

11 ఏళ్ల కొడుకు ఉన్న డాక్ట‌ర్ తో డైరెక్ట‌ర్ క్రిష్ రెండో పెళ్లి నిజ‌మేనా..?

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra