ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న టీడీపీ పసుపు పండుగ మహానాడుకు తెలుగుదేశం ఆత్మీయ కుటుంబ సభ్యులు తరలి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మహానాడులో అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పంపారు.
మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు తరలి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. మహానాడులో అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పంపారు. ఒంగోలు వేదికగా నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చతోపాటు.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధాలను ఎండగట్టను న్నట్లు పేర్కొన్నారు.
తెలుగు జాతి ఆత్మగౌరన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంతోపాటు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పలికిన ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఏటా పార్టీ ప్రతినిధుల మహానాడు జరుపుకోవటం.. తెలుగుదేశం సంప్రదాయమని ఆహ్వానంలో గుర్తు చేశారు. మహానాడు సందర్భంగా ప్రత్యేక వాట్సప్ డీపీని తెలుగుదేశం విడుదల చేసింది.
అదేవిధంగా మహానాడుకు కొత్తగా డిజిటల్ హంగులను జత చేశారు. ప్రతి ఒక్కరి సభ్యత్వాన్ని డిజిటల్ రూపంలోనే తీసుకుంటున్నారు. అదేవిధంగా.. పేర్ల నమోదు.. మహానాడుకు ఎంత మంది వచ్చారు. వంటి వివరాలను డిజిటల్ రూపంలోనే తీసుకంటున్నారు. ఫేస్బుక్, యూట్యూబ్ లైవులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు వివరాలను షేర్ చేస్తున్నారు. సీబీఎన్ ఆర్మీ .. ప్రత్యేకంగా.. సేవలు అందిస్తోంది. మొత్తంగా.. మహానాడులో డిజిటల్ విప్లవం కనిపిస్తోంది.