• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కమల వికాసం.. ఆ ముగ్గురూ ఖేల్ ఖతం!

admin by admin
February 8, 2025
in India, Politics, Trending
0
0
SHARES
48
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 27 ఏళ్ల త‌ర్వాత క‌మ‌లం విక‌సించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్ కి బీజేపీ చెక్ పెట్టింది. భారీ ఆధిక్యంతో బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా దూసుకెళ్తుండ‌గా.. ఆప్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మ‌రోవైపు కాంగ్రెస్ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 23 స్థానాల్లో మాత్రమే లీడ్ ఉంది.

ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలపడ‌గా.. ఢిల్లీ ఓట‌ర్లు ఇక పాలించింది చాలు అంటూ ఆమ్ ఆద్మీకి రెస్ట్ ఇచ్చారు. కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డించినా ఫ‌లితం లేకుండా పోయింది. మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న అగ్ర నేత‌లు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యందర్ జైన్ ముగ్గురూ బీజేపీ అభ్య‌ర్థుల చేతుల్లో ఖేల్ ఖతం అయ్యారు. కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు సాహిబ్‌ సింగ్‌ కుమారుడు పర్వేశ్‌ వర్మ విజ‌యం సాధించ‌గా.. మనీష్‌ సిసోడియాను తర్వీందర్‌సింగ్‌, సత్యందర్ జైన్‌ను కర్నాల్‌ సింగ్ ఓడించారు.

ఇక ఢిల్లీ ఎన్నిక‌ల‌ ఫలితాలపై కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభినందనలు.. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నాం. ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాన‌ని.. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటామని మాజీ ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా త‌ల‌ప‌డిన‌ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.

Tags: AAParvind kejriwalBJPDelhiDelhi Assembly electionsDelhi ElectionDelhi Election Results 2025Latest newsTelugu News
Previous Post

కేజ్రీవాల్ కు బిగ్ షాక్

Next Post

స‌మంత‌ తో విడాకుల‌పై చైతూ ఘాటు వ్యాఖ్య‌లు!

Related Posts

Politics

రియల్టర్లకు కేటీఆర్ షాకింగ్ న్యూస్

April 3, 2025
Movies

పొలిటిషన్ తో పెళ్లి.. ప్ర‌దీప్ రియాక్ష‌న్ వైర‌ల్!

April 3, 2025
Andhra

పోలీసుల‌తోనే ఆట‌లు.. కాకాణి అరెస్ట్ త‌ప్ప‌దా..?

April 3, 2025
Andhra

ఆ వైసీపీ నేత‌పై ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌..!

April 3, 2025
Andhra

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై భార్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..!

April 3, 2025
Movies

గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి.. నాని టీమ్ వార్నింగ్‌!

April 3, 2025
Load More
Next Post
Samanta, nagachaitanya

స‌మంత‌ తో విడాకుల‌పై చైతూ ఘాటు వ్యాఖ్య‌లు!

Latest News

  • రేవంత్ కు చుక్కెదురు..ఏప్రిల్ 7 వరకు కోర్టు స్టే
  • రియల్టర్లకు కేటీఆర్ షాకింగ్ న్యూస్
  • పొలిటిషన్ తో పెళ్లి.. ప్ర‌దీప్ రియాక్ష‌న్ వైర‌ల్!
  • పోలీసుల‌తోనే ఆట‌లు.. కాకాణి అరెస్ట్ త‌ప్ప‌దా..?
  • ఆ వైసీపీ నేత‌పై ప‌వ‌న్ స్పెష‌ల్ ఫోక‌స్‌..!
  • పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై భార్య ఫ‌స్ట్ రియాక్ష‌న్‌..!
  • గజరాజు నడిస్తే గజ్జి కుక్కలు అరుస్తాయి.. నాని టీమ్ వార్నింగ్‌!
  • హెచ్ సీయూ..హైకోర్టు చెప్పినా వినని రేవంత్ సర్కార్
  • జగన్ అండ్ కోకు లోకేశ్ మాస్ వార్నింగ్
  • `ఆదిత్య 369` లో హీరోయిన్‌గా మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?
  • స‌వాల్ కు సౌండ్ లేదు.. జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్‌!
  • అరెస్ట్ భ‌యంతో మాజీ మంత్రి కాకాణి హైడ్రామా..!
  • సూపర్ హీరోగా రవితేజ
  • ఠంచ‌నుగా పంచేశారు: ద‌టీజ్ బాబు
  • హిట్ ప‌డినా ద‌క్క‌ని ఛాన్సులు.. పాయ‌ల్ ఎమోష‌న‌ల్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra