యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మొదటి వివాహ బంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ సమంత తో సుమారు ఏడేళ్లు ప్రేమాయణం నడిపిన నాగచైతన్య.. 2017లో పెద్దల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే అనుకున్నంత సాఫీగా వీరి వైవాహిక జీవితం సాగలేదు. 2021లో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరి జీవితాన్ని గడుపుతుండగా.. చైతూ శోభిత ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు.
అయితే చైతూ-సామ్ విడాకుల విషయంలో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. కొందరు సమంతదే తప్పంటే.. మరికొందరు చైతూను వైపు వేలిత్తి చూపారు. తాజాగా మాజీ భార్య సమంతతో విడాకులు తీసుకోవడంపై చైతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. విడాకులు తీసుకోవాలనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదని, ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశాడు. తామిద్దరం తమ స్వంత మార్గాల్లో వెళ్లాలనుకున్నాము. స్వంత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికీ ఒకరిపై ఒకరు చాలా గౌరవంగా ఉన్నాము. ఇంతకంటే వివరణ ఏం కావాలో నాకు అర్థం కాలేదని చైతూ వ్యాఖ్యానించారు.
తమ విడాకుల అంశం ఇతరులకు వినోదంగా మారిందని.. ఎన్నో గాసిప్స్ రాశారని చైతూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపైనా తమపై నెగెటివ్ కామెంట్లు చేయడం మానేసి.. మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలని చైతూ హితవు పలికారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన `తండేల్` మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మెజారిటీ ఆడియన్స్ నుంచి పాజిటిల్ టాక్ లభించింది. చేతూకు తండేల్ కంబ్యాక్ మూవీ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.