కేజీఎఫ్ చిత్రంతో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. అండర్ డాగ్ గా రిలీజ్ అయిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రికార్డు వసూళ్లు కలెక్ట్ చేసింది. దీంతో, ప్రశాంత్ నీల్ తో సినిమాలు తీసేందుకు స్టార్ హీరోలు క్యూ కట్టారు. ఆల్రెడీ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే పట్టాలెక్కించిన ప్రశాంత్ నీల్…ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తోనూ ఓ చిత్రం చేయడం ఫిక్సయింది.
తాజాగా కేజీఎఫ్ ప్రమోషన్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్…తారక్ తో సినిమాపై స్పందించారు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్ తో తనకు సాన్నిహిత్యం ఉందని, 20 ఏళ్లుగా తాను ఎన్టీఆర్ అభిమానినని చెప్పుకొచ్చారు. అటువంటి తారక్ తో ఓ ప్రాజెక్టు కోసం కసరత్తులు చేస్తున్నానని, ఎన్టీఆర్ కు స్క్రిప్టు బాగా నచ్చిందని అన్నారు. కానీ, తారక్ తో చేయబోయే సినిమా ఏ జానర్ అని మాత్రం అడగొద్దని చెప్పారు. స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ ను పది, పదిహేను సార్లు కలిసుంటానని అన్నారు.
ఇక, ఆర్ఆర్ఆర్ తో బంపర్ హిట్ కొట్టిన తారక్…త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే చిత్రం పట్టాలెక్కనుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన దీపిక పదుకొణే ఫిక్సయిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న దీపికా…బాలీవుడ్లోనే అత్యధిక రెమ్యున్ రేషన్ తీసుకునే హీరోయిన్. ఆల్రెడీ ‘ ప్రాజెక్టు K’ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా నటిస్తోన్న దీపికా…తారక్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి.