• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అంబరాన్నంటిన వాషింగ్టన్ తెలుగు సమితి ‘ఉగాది’ సంబరాలు

admin by admin
April 11, 2022
in NRI
0
0
SHARES
261
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏప్రిల్ 9 శనివారం సాయంత్రం వాషింగ్టన్ తెలుగు సమితి నిర్వహించిన శుభకృత్ నామ ఉగాది ఉత్సవం అంగరంగ వైభవంగా ఎవెరెట్ లోని సివిక్ ఆడిటోరియం వేదికగా నిర్వహించారు. ఇండియా నుంచి విచ్చేసిన తారలు మరియు వాషింగ్టన్ నలుమూలలు నుండి 1400 పైగా వాషింగ్టన్ లోని తెలుగు వీక్షకులులు , కళాకారులతో , సర్వాంగ సుందరంగా అలంకరిచిన ఆడిటోరియం కళ కళ లాడింది. నూతనంగా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ అబ్బూరి నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి వినూత్నంగా రూపొందించిన ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు ఆరు గంటల పాటు దాదాపు 35 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగింది. 200 కి పైగా చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక, చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి. ఉగాది పండగ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా తోరణాలు, బ్యానర్లు, పూదండలతో శోభాయమానంగా అలంకరించిన స్వాగత వేదిక వాషింగ్టన్ లోని తెలుగు ప్రేక్షకులని సాదరంగా ఆహ్వానించింది. సభ్యుల పరస్పర పలకరింపులతో, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, పిల్లల అల్లరి చేష్టలతో, నిర్దేశించిన సమయానికన్నా ముందే హాలు నిండిపోయింది.

వాషింగ్టన్ లో బోతెల్ వున్న తెలుగు పూజారి శ్రీ వాసుదేవ శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం మరియు ఈ కొత్త సంవత్సర రాశి ఫలాలను అందరికీ విశదీకరించారు. వాషింగ్టన్ నలుమూలలు నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనలతో ఆధ్యాంతం ఆకట్టుకున్నారు .అలాగే ఆర్కెస్ట్రా తో స్థానిక బృదం ప్రేక్షకులను ఉర్రుతలూగించారు .ఇండియా నుండి విచ్చేసిన సినీ తారలు అదితి గౌతమ్ మరియు పూజ ఝవేరి డాన్సులతో వేదిక ప్రాంగణం హోరు మన్నది.కొస మెరుపుగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి సినీ తారలతో వేదిక మీదకు వచ్చి డాన్సులు చెయ్యడంతో స్టేజి ఈలలు చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ ఉగాది ఉత్సవాలలో ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తాపేశ్వరం కాజా లాంటి పాతిక తెలుగు సాంప్రదాయ వంటకాలతోపాటు షడ్రుచుల ఉగాది పచ్చడి ,అరిటాకు సహపంక్తి భోజనాలు వాషింగ్టన్ తెలుగు వారి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయనడంలో అతిశయోక్తి లేదు.ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి మరియు కార్యకర్తలు సాంప్రదాయ తెలుగు పంచెకట్టుతో అందరికీ కొసరి కొసరి వడ్డించి మన అసలు సిసలు తెలుగు సాంప్రదాయ ఆతిధ్యాన్ని చవి చూపించడంతో తెలుగు సభ్యులు తాము స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నామన్న విషయం మరచేలా చేసింది

చివరిగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి , ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వనితులకు మరియు ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్య వర్గానికి , కార్య కర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు . ఈసారి వినూత్నంగా స్పాన్సర్స్ కు మరియు ముఖ్యంగా తెలుగును ముందు తరాలకు తీసుకు వెళ్ళటం లో ముఖ్య భూమిక పోషిస్తున్న తెలుగు బడి అధ్యాపక బృందానికి శాలువాలతో సత్కరించారు . అనంతరం, శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాన్ని వివరించారు. మన సంస్కృతీ, సంప్రదాయాల ఉద్దీపనకి, మన తెలుగు కమ్యునిటీ సంక్షేమానికి వాట్స్ చేస్తున్న కృషిని మరియు ఈ సంవత్సరం తాము నిర్వహించబోయే కార్యక్రమాలను వివరించి కార్యక్రమాన్నిముగించారు.

Tags: washington ugadi sambaralu
Previous Post

జగన్ కు షాక్…రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్త నేతల నిరసనలు

Next Post

తారక్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్?

Related Posts

Around The World

సౌదీ రాజధాని రియాధ్ చరిత్రలో ప్రప్రధమంగా మహానాడు!

June 3, 2025
Around The World

మహానాడు లో బుచ్చి రాం ప్రసాద్ ప్రసంగం మరియు ఫోటో గ్యాలరీ !

June 1, 2025
Around The World

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
Andhra

టీడీపీలో మూడో కీలక వ్యక్తిగా ఎదిగిన ‘రాజేష్ కిలారు’!

May 27, 2025
Around The World

బే ఏరియా లో తారక రాముని 102వ జయంతి!

May 27, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post

తారక్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్?

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra