ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి రావడంతో కొన్ని మంచిపనులు జరుగుతుండగా.. మరి కొన్ని మాత్రం దుష్పరిణామాలకు దారి తీస్తున్నాయి. దీనిలో డీప్ ఫేక్ వీడియోలు కీలకంగా మారాయి. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు కలక లం సృష్టిస్తు న్నాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ డీప్ ఫేక్ వీడియో హల్చల్ చేసినప్పుడు పార్టీలు ఖండించాయి.
తర్వాత.. సినీ సెలబ్రిటీలపైనా డీప్ ఫేక్ వీడియోలు హల్చల్ చేశాయి. ఇక, ఇప్పుడు తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పైనా డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపాయి. వీటికి కట్టడికి కేంద్రం చర్యలు చేపడుతున్నా వీటి బెడద మాత్రం తప్పడం లేదు. మార్ఫింగ్ వీడియోలపై ప్రముఖుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చక్కెర వ్యాధికిసంబంధించిన ఓ డ్రగ్‌ను యోగి ప్రమోట్ చేస్తున్నట్టు డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది.
షుగర్ వ్యాధి తీవ్రమైందని.. దీని బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేసి వినియోగించాలని ఈ ప్రచార చిత్రంలో యోగి పేర్కొంటున్నారు. ఓ న్యూస్ ఛానల్ క్లిప్‌లో ఆయన మాట్లాడుతున్నట్లుగా దీనిని రూపొం దించడం గమనార్హం. హజ్రత్‌గంజ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసు లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నకిలీ వీడియోలు సంచలనం రేపాయి.