రాష్ట్రంలో జగన్ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ పూర్తిగా కొరవడిందని టీడీపీ అధినేత చంద్ర బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, మహి ళలపై జరుగుతున్న దాడులు, హత్యలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, మహిళలు బయటకు రావాలం టేనే భయపడుతున్న పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో మాట్లాడిన చంద్రబాబు..రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై మాట్లాడుతూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాం ధ్ర నుంచి నవ్యాంధ్ర వరకూ 67 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రులు పనిచేశారన్న చంద్రబాబు ఏనాడూ ఇన్ని నేరాలూ ఘోరాలు జరగలేదని తెలిపారు.
జగన్రెడ్డి 19 నెలల పాలనలో అరాచకాలు, అత్యాచారాలు, హత్యలతో రాష్ట్రం రావణకాష్టంగా మారిపో యిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. “సమైక్యాంధ్ర నుంచి నవ్యాంధ్ర వరకూ 67 ఏళ్లలో 18 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఈ 19 నెలలలో జరుగుతున్న అత్యాచారాలు, ఆడబిడ్డలపై జరుగుతున్న వేధింపులు, ఆడపిల్లలను అతికిరాతకంగా వాడుకుని వారిని చంపేసిన విధానం ఎప్పుడూ జరగలేదు. ఒక సంఘటన, రెండు సంఘటనలు కాదు. ఒక్క అనంతపురం జిల్లాలోనే మూడు సంఘటనలు అత్యంత దారుణమైనవి చోటు చేసుకున్నాయి. కళ్యాణదుర్గంలో మైనారిటీ ఆడబిడ్డను అత్యాచారం చేసి హత్య చేశారు. మరో నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డపై ఓ లారీ డ్రైవర్ అఘాయిత్యం చేస్తే.. ఆయనపై చర్యలు తీసుకోక పోగా.. విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఇక, సాక్షాత్తూ సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ పై అత్యాచారం జరిగితే.. కనీసం ఆ సమాచారాన్ని కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాజమండ్రిలో మైనర్ బాలికపై దాదాపు 12 మంది అత్యాచారం చేసి రోడ్డు మీద పడేసి పోయారు. ఆమె పోలీసులను ఆశ్రయిస్తే.. కనీసం మనో ధైర్యం చెప్పి.. నిందితులను పట్టుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. బాధితురాలిపై ఒత్తిడి తెచ్చి.. ఏమీ జరగలేదని చెప్పమని ఒత్తిడి చేశారు. అయినా.. ఆ బాలిక ధైర్యంగా జరిగింది చెప్పేందుకు ముందుకు వచ్చింది.
మరి మీరు తీసుకువచ్చిన దిశచట్టం ఏమైంది? తాడేపల్లిలో ఉంటూ.. ఏం ఉద్ధరిస్తున్నారు? గడ్డి పీకుతున్నారా? ఏం చేస్తున్నారు? ఎందుకు స్పందించలేదు. విజయవాడలోనే ఒకడు ఏకపక్షంగా ప్రేమిస్తున్నానంటూ.. ఓ యువతపై దారుణానికి ఒడిగడితే.. ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి.. మీ ఇంటికి పిలిచి మాట్లాడతారా? ఎంత గర్వం మీకు! మీ తండ్రి చనిపోతే.. ప్రజలనుంచి సానుభూతి పొందేందుకు ఓదార్పు యాత్రల పేరిటనానా గడ్డీ తిన్నారే మీరు(జగన్).. బాధితురాలిని ఏం ఓదార్చారు మీరు. ఇక, అబ్దుల్ సలీం కుటుంబం.. మీ పార్టీ నేతల వేధింపులు భరించలేక కుటుంబానికి కుటుంబమే రైలు కింద పడి చనిపోతే.. నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ బంధువులను పరామర్శించకుండా.. గెస్ట్ హౌస్కు పిలిచి మాట్లాడతారా? ఏంటీ అరాచకాలు..? ఎప్పుడైతే మీరు దోషులను కాపాడడం ప్రారంభించారో.. ఎప్పుడైతే.. మీరు నేరస్తులకు కొమ్ముకాయడం ప్రారంభించారో.. అప్పుడే రాష్ట్రంలోని మహిళలకు ఈ సమస్యలు వచ్చాయి“ అంటూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్పై నిప్పులు చెరిగారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో జగన్ పాలన మహిళలకు కంటకంగా మారిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.