ఘనంగా డా.రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

గుంటూరు(24.12.20):-  మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు గురువారం నాడు ఆయన అభిమానులు వివిధ పార్టీల నాయకుల, కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక రింగ్ రోడ్డులోని డా.రాయపాటి నివాసం వద్ద రాయపాటి యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును ఆయన కట్ చేసి నాయకులకు, అభిమానులకు తినిపించారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దుశాలువాఆయనకు కప్పి ప్రసాదం,పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. డా. రాయపాటి ఆయన నివాసం వద్ద చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర (నాని), ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, జీ.డీ.సి.సి బ్యాంకు చైర్మన్ రాతం శెట్టి రామాంజనేయులు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్ర రావు, మాజీ ఆర్.ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు టీ.రాజా సిధార్థ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మినిస్ట్రియల్  యూనియన్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్,ట్రిపుల్ ఎస్ సోప్ అధినేత మాణిక్య వేల్, ఎస్సీ నాయకులు ఈరి రాజశేఖర్ , విజయ్ కుమార్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండీ హిదాయత్, కందుల నరసింహారావు, టి. కేశవ యాదవ్ టీ.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర నాయకులు రాయపాటి అమృత రావు తదితరులు పాల్గొన్నారు.

షిరిడి సాయి దీనజన సేవా సమితి
డా. రాయపాటి శ్రీనివాస్ జన్మదినం సందర్భముగా రాయపాటి యువత ఆధ్వర్యంలో షిరిడీ సాయి దీనజన సేవా సమితి వద్ద ఏర్పాటు చేసిన బర్త్డే కేకును డా.రాయపాటి  కట్ చేసి అక్కడి విద్యార్థులకు తినిపించి, పండ్లు, బిస్కెట్ లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ యార్డ్ డైరక్టర్ రాజపుత్ర సత్యం సింగ్, రాష్ట్ర ఓ.బీసీ అధ్యక్షులు అన్కవరపు వరప్రసాద్,దాసరి జాన్ బాబు, టీ. రాజా సిద్ధర్థ షేక్ జిలాని, లక్ష్మయ్యా, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన కేకును డా.రాయపాటి కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ వెంకటేష్, కన్నసాని బాజీ, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో   ఏర్పాటు చేసిన జన్మదిన కేకును డా.రాయపాటి కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు.ఈ కార్యక్రమంలో రాయపాటి అమృత రావు, భరత్, ధర్మతేజ,mvs, ఈదర అనంత్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పనులమీద  అమెరికాలో బిజీగా గడుపుతున్న  తెలుగుదేశం నిర్వాహక కార్యదర్శి 'బుచ్చి కలపటపు' ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.