భారత్ లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే మన దేశంలో సెకండ్ వేవ్ కేసులు మెరుపు వేగంతో పెరుగుతూ పోతున్నాయి. మొదటి వేవ్ లో కరోనా వేరియంట్ తో పోలిస్తే సెకండ్ వేవ్ కరోనా వేరియంట్ 60 శాతం ఎక్కువగా వేగంగా వ్యాప్తి చెందడం ఇందుకు ఒక కారణమైతే… చాలామంది ప్రజలు కనీస కరోనా నిబంధనలు పాటించకపోవడం మరొక కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత్ లో గత వారం రోజులగా రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువ కావడం కలకలం రేపుతోంది. నిన్న కొత్తగా మనదేశంలో రికార్డు స్థాయిలో 2,95,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరింది. గత 24 గంటలలో 2,023 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,82,553కు పెరిగింది.
మరోవైపు, తెలంగాణలో మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల మధ్య 6,542 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో కరోనాతో 20 మంది ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,67,901కి చేరుకోగా…తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,876కు చేరుకుంది.