యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు భారీ షాక్ తగిలింది. కరోనా నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ అయింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. ప్రజల్లో కల్లోలం సృష్టించేలా ఉన్నాయని.. ఆయన వల్ల.. ఇంగ్లీష్ మెడిసిన్‌పై తీవ్ర అపోహలు పెచ్చరిల్లే ఛాన్స్ ఉందని పేర్కొంటూ.. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి రామ్‌దేవ్‌కు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది.
అంతేకాదు, దుపరి విచారణ సమయం వరకు రామ్‌దేవ్ మీడియా ముందుకు రాకూడదని, ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. అయితే.. కరోనా నివారణ లేదా నియంత్రణకు.. అల్లోపతి మెడిసిన్‌గా.. కొరోనిల్ టాబ్లెట్ ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే.. దీనిపై రామ్‌దేవ్‌బాబా గతంలో విమర్శలు చేశారు. దీనివల్ల కరోనా తగ్గదని.. ఇది వృథా మెడిసిన్ అని వ్యాపారం చేస్తున్నారని.. టీవీ ప్రకటనల్లో పేర్కొన్నారు.
దీంతో ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే. “కొరోనిల్‌తో కరోనా తగ్గుతుందా లేదా అన్నది నిపుణులు తేల్చాలి.. కొరోనిల్‌కు సంబంధించి ఆయుష్ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది“ ఇక, రామ్‌దేవ్ బాబా విషయంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎమ్ఏ) కూడా సీరియస్ అయింది. రామ్‌దేవ్ బాబాపై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది.
అల్లోపతి మెడిసిన్‌పై బాబా రామ్ దేవ్ తప్పుడు, అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్లో పేర్కొంది. ఆమోదింపబడ్డ పద్ధతిలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై, ఉపయోగిస్తున్న మందులపై తరచూ.. ఉద్దేశ్యపూర్వకంగా ఆయన నిరాధార, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది.ఈ నేపథ్యంలో తాజాగా రామ్ దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు.. సమన్లు జారీ చేయడం, మీడియా ముందుకు రాకుండా ఆంక్షలు విధించడం గమనార్హం. ఈ క్రమంలో విచారణ పూర్తయి.. ఆయనపై అభియోగం నిజమని తేలితే.. కటకటాలు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.