పుంగనూరు, వినుకొండ ప్రాంతాలలో జరిగిన ఘర్షణలు.. పోలీసుల దూకుడు.. టీడీపీ నేతలపై కేసులు.. అనంతరం నేతలకు విధించిన ఆంక్షలు.. ఈ విషయాలను గమనిస్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అటెన్షన్ ను డైవర్ట్ చేసే కుట్ర ఏదైనా జరుగుతోందా? ఆదిశగా అధికార పార్టీ అడుగులు వేస్తోందా? అనే అనుమానా లు వ్యక్తమవుతున్నాయని టీడీపీ సీనియర్లు అంటున్నారు. ప్రస్తుతం టీడీపీకి సానుభూతి పెరుగుతోంది.
పైగా.. పార్టీ అగ్రనాయకులు.. చంద్రబాబు, నారా లోకేష్‌లు కూడా ప్రజల మధ్యే ఉంటున్నారు. ఈ నేప థ్యంలో ప్రజల దృష్టి వారిని ఆకర్షిస్తోంది. సమస్య ఏదైనా తక్షణం స్పందిస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తు న్నారు. అదేసమయంలో మినీ మేనిఫెస్టోపై తరచుగా వివరణ ఇస్తున్నారు. మహిళా ఓటుబ్యాంకు ను కూడా పెంచుకునే వ్యూహంలో ఉన్నారు. దీనికితోడు.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా దూకుడుగా నే ఉన్నారు.
పాదయాత్రకు సంఘీభావ యాత్రలు చేయడం.. చంద్రబాబు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం.. భరో సా యాత్రలు చేపట్టడం వంటివి సహజంగానే ప్రజల్లో టీడీపీ వాదన వినిపించేలా చేస్తున్నారు. ఇది మరో 8 మాసాల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రతిఫలించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాదం బలపడితే.. వైసీపీకి న్యూట్రల్ ఓటు దూరమయ్యే అవకాశం ఉందనే అంచనా ఉంది. దీంతో వైసీపీ వ్యూహాత్మకంగాఅడుగులు వేస్తోందని టీడీపీ నేతలు అంచనావేస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ యాత్రలు, రోడ్ షోలకు విఘాతం కలిగిస్తే.. ప్రజల్లో సానుభూతి తగ్గే అవకాశం ఉంటుం దని వైసీపీ అంచనా వేస్తోందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంతంగా జరిగిపోయే కార్యక్రమాలను కూడా.. వివాదం చేస్తున్నారని.. అనవసర ఉద్రిక్తతలకు దారితీసేలా పోలీసులను ప్రోత్స హిస్తున్నానేది టీడీపీ నాయకుల వాదనగా ఉంది. ఈ నేపథ్యంలో కుట్ర ఏదైనా జరుగుతోందా? టీడీపీ హవాను తగ్గించేందుకు లేదా.. న్యూట్రల్ ఓటర్లను భయ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అనేది సీనియర్ల అనుమానం. మరి దీనిలో నిజమెంత? అనేది చూడాల్సి ఉంది.