తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తమ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇదే సమయంలో రాష్ట్రంలోని పొత్తుల పంచాయతీని సైతం క్లియర్ చేసింది. గత కొద్దికాలంగా చర్చల్లో ఉన్న కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు అయింది. వారికి కేటాయించే నియోజకవర్గాల పేర్లను సైతం ప్రకటించింది. 55 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇదే సమయంలో తెలంగాణలో మిత్రపక్షమైన సీపీఐకి రెండు సీట్లు ఇచ్చింది. పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలోనూ ఆ పార్టీకి సమాచారం అందించింది. సీపీఎంతోనూ కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి చర్చ జరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కలిసే పోటీ చేస్తామని సీపీఎం, సీపీఐ నేతలు మరోసారి స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ తేల్చినా, తేల్చకపోయినా.. తాము పోటీ చేసే స్థానాలను వెల్లడించాలని నిర్ణయించాయి. కాంగ్రెస్తో పొత్తు వద్దనుకోవడం లేదని పేర్కొన్న కమ్యూనిస్టు నేతలు ఆ పార్టీ తమతో పొత్తు విషయంలో నాన్చివేత దోరణితో ఉంటే తమ నిర్ణయం తాము తీసుకుంటామని పేర్కొన్నాయి. దీంతో కాంగ్రెస్ తగు రీతిలో స్పందించింది. వామపక్షాలకు ఏఏ సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఆసక్తి ఉందనే సమాచారం తీసుకుంది. అనంతరం తమదైన శైలిలో వివరాలు రాబట్టి సీట్లు కేటాయించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై పార్టీ తెలంగాణ నేతలతో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. అనంతరం మిత్రపక్షమైన సీపీఐకి రెండు సీట్లు ఇచ్చింది. సీపీఎంతోనూ కాంగ్రెస్ చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలోనూ ఆ పార్టీకి సమాచారం అందించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సీట్లు ఖరారు చేసిన కాంగ్రెస్ ఈ మేరకు సీపీఐకి పోటీ చేసే చాన్స్ ఇచ్చింది. కాగా, సీపీఐ, సీపీఎంలు చెరో ఐదు స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయించి ఈ మేరకు కాంగ్రెస్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.