తెలంగాణలో త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. రేవంత్ రెడ్డిచేపట్టిన `హాత్ సే హాత్ ` పాదయాత్ర జోరుగా సాగుతోంది. రెండో రోజు మంగళవారం ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాయాల్లో నిన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్నారు. పేదలందరికీ ఇల్లు ఇస్తామన్నారు. ఇళ్ళ నిర్మాణానికి ఒక్కొక్కరికి 5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హాత్ సే హాత్ పాదయాత్రలో భాగంగా వెంకటాపురం మండలం కేశవాపూర్లో వరి, మిర్చి తోటలో పనిచేస్తున్న మహిళా కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలు రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. పంట గిట్టుబాటు గురించి అడిగి తెలుసుకున్నారు.
అలాగే కూలీలతో కలిసి కాసేపు రేవంత్ మిర్చి తెంపారు. రైతు కూలీలు తెచ్చుకున్న సద్ది లోంచి రేవంత్, సీతక్కకు, మల్లు రవిలకు అన్నం ముద్దలు కలిపి పెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రభు త్వం వస్తేనే పేదలకు న్యాయం చేసేందుకు సాధ్యమౌతుందని వారికి సూచించారు. కాంగ్రెస్ను గెలిపిం చేందుకు మీరంతా పని చేయాలని మహిళా కూలీలతో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడున్న కష్టాలు తొలిగిపోయి.. రాష్ట్రంలో అందరికీ మేలు జరుగుతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. కూలి పనులు పెద్దగా లేవని.. ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. అన్ని ధరలూ పెరిగిపోయాయన్నారు. తమ జీవితాలు ఇబ్బందిగా ఉంటున్నాయని తెలిపారు. రేవంత్ వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు. వరుసగా రెండో రోజు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగానే పాల్గొన్నా.. కీలక నేతలు మరోసారి మొహం చాటేశారు.
We move forward with the spirit you have given us that filled our hearts with valour & courage of divine Sammakka and Saralamma.
Mulugu constituency street corner meeting on #Day2 of #YatraForChange#HaathSeHaathJodo pic.twitter.com/05SydwxdX9
— Revanth Reddy (@revanth_anumula) February 7, 2023