తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కూతురు కవితపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ వ్యంగ విమర్శలు చేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు శుభాభివందనాలు. మీరు 16 నెలలు నిరుద్యోగం వల్ల అనుభవించిన వేదనకు శుభం కార్డు పడింది. 16 నెలలు నిరుద్యోగంతో ఉంటేనే ఎంతో సతమతం అయ్యారు. మీ కోరిక తీరింది. ఇక ఇప్పటికైనా 66 నెలలుగా నిరుద్యోగంతో అవస్థలు పడుతున్న తెలంగాణ నిరుద్యోగ యువత ఘోష వినండి. లక్షలాది తెలంగాణ ప్రజలు నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు అని సంపత్ కుమార్ విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా కవిత గెలుపు అనంతరం సోషల్ మీడియాలో పలు మీమ్ లు వైరల్ అయ్యాయి. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. హిమాన్షుకి ఒక్కటి ఇప్పిస్తే సరిపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్… ఇలా 5 మందికి టీఆర్ఎస్ పదవులు కల్పించింది. పార్టీ ప్రజలదే గాని పదవులు మాత్రం మావే అని మీరు ఎంజాయ్ చేస్తే సరిపోతుందా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.