మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 56 వేల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంత రం మాట్లాడుతూ.. తెలంగాణకు పెద్దన్నలా ఉంటానని చెప్పారు. దేశంలో నేడు జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ ఓ ఉదాహరణగా అభివర్ణించారు. రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకింత చేసిన ఆయన ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు, ఆరు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికి కేంద్రం ఎప్పుడూ ముందే ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతోందని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము ఆకాంక్షి స్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. అందుకే జాతీయ రహదారుల నుంచి అన్ని విభాగాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా 56 వేల కోట్లు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తద్వారా దేశం బలపడుతుందని వివరించారు. కేంద్రంలో తాము తీసుకన్న నిర్ణయాలతోనే దేశంలో పాతిక కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని పేర్కొన్నారు. పదేళ్లుగా అనేక రంగాల్లో దేశం వృద్ధి బాటలో దూసుకెళ్తున్నట్టు వివరించారు.
సీఎం రేవంత్ ఏమన్నారంటే..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర-రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్ప డుతోందని తెలిపారు. ప్రధాని మోడీని పెద్దన్నగా ఆయన అభివర్ణించారు.. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ సహా చాలా రంగాల్లో వెనుకబడ్డామని తెలిపారు. కేంద్రంతో ఘర్షణపూరిత వైఖరితో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుబడుతుందని చెప్పారు. రాష్ట్రానికి పెద్దన్నగా భావించి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సభ నుంచే ప్రధానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
పాలన విషయంలో, తెలంగాణ ప్రజల బాగోగుల విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. గుజరాత్‌లా అభివృద్ధి సాధించాలంటే తెలంగాణకు ప్రధానమంత్రి మోడీ సాయం కావాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని చాలా విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అలాంటి వాటిలో విద్యుత్ ఒకటని పేర్కొన్నారు. నాలుగువేల మెగావాట్లకు బందులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించామని పేర్కొన్నారు. మిగిలిన వాటిని త్వరగా పరిష్కరించాలని విన్నవించారు.