• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నన్నూ అరెస్ట్ చేయండి…మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

నారదా కుంభకోణంలో ఇద్దరు మంత్రుల అరెస్టు...సీబీఐ ఆఫీసు ముందు దీదీ నిరసన

admin by admin
May 17, 2021
in India, Politics, Top Stories
0
0
SHARES
200
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా దీదీ కోటలో పాగా వేయాలని మోదీ విశ్వప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ లో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు దాడిచేశారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

నార‌ద కుంభ‌కోణం కేసులో ప‌శ్చిమ బెంగాల్ రవాణా శాఖా మంత్రి ఫిర్హాద్ హ‌కీంతో పాటు మరో మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ కుంభకోణంలో ఫిర్హ‌ద్‌తోపాటు మ‌ద‌న్ మిత్రా, సుబ్ర‌తా ముఖ‌ర్జీ, సోవ‌న్ చ‌ట‌ర్జీల‌, నాటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై ఆరోపణలున్నాయి. దీంతో, ఈ కేసు విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.

ఈ క్రమంలో హకీం అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దీదీతోపాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీబీఐ కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారని, తనను కూడా సీబీఐ అరెస్ట్ చేయాలని మమత డిమాండ్ చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని బీజేపీ తమ నేతలను అరెస్టు చేసి కక్ష సాధిస్తోందని దీదీ ఆరోపించారు. మంత్రి ఫిర్హాద్ హ‌కీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ నిరసనలపై రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకుల్లా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అక్కడ శాంతిభద్రతలను పునరుద్దరించాల్సిందిగా పోలీసులను గవర్నర్ కోరారు.

2014లో ఓ వ్య‌క్తి తాను బ‌డా వ్యాపారవేత్తనంటూ… ప‌శ్చిమ బెంగాల్‌లో పెట్టుబ‌డులు పెడ‌తానంటూ, ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యేను క‌లిశారు. ఈ నేప‌ధ్యంలో వారికి కొంత డ‌బ్బు ఇచ్చినట్టు ఆడియో టేపులు బయటకు వచ్చి, సంచ‌ల‌నం సృష్టించాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ టేపుల వ్యవహారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2021 ఎన్నికల్లో బీజేపీ ఓటమితో తాజాగా ఈ టేపుల వ్య‌వ‌హారం తెర‌పైకి రావడం చర్చనీయాంశమైంది.

Tags: bengal cm mamata benarjeecbi probeminister arrestednaradha scamwest bengal politics
Previous Post

రఘురామను కాపాడండి…రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ

Next Post

జగన్ సర్కార్ పై ఏబీఎన్, టీవీ5 వార్

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

జగన్ సర్కార్ పై ఏబీఎన్, టీవీ5 వార్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra