జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని ఓట్లు గుద్దేశారు జనం. నిజంగానే అద్భుతాలు జరిగాయి. కానీ జనం అనుకున్న అద్భుతాలు కాదు, జగన్ అనుకున్న అద్భుతాలు జరిగాయి.
ఎన్నికలు అయిపోయిన తర్వాత వందిమాగదుల క్షేమం తప్ప వేరే పనిచేయడం లేదు. ఇక స్కాములకు లెక్కే లేదు. అన్ని ఉపయోగకరమైన పథకాలు ఎత్తేసి వాటికి ఖర్చయ్యే సగం డబ్బులు చిల్లర రూపంలో జనాలకు నేరుగా వేసి వారిని టెంప్ట్ చేస్తున్నాడు వైసీపీ అధినేత జగన్. కానీ అతను ఎన్ని చేసినా… జగన్ పాలన పై వ్యతిరేకత చాపకింద నీరులా పారుతోంది.
ఒక అంచనా ప్రకారం ఏపీలో జగన్ వల్ల ఇబ్బంది పెట్టిన వారి జాబితా తయారుచేస్తే పెద్దగానే ఉంది. మరి ఎవరు జగన్ నుంచి జారిపోయారో చూద్దామా?
1. వైసీపీ సర్పంచులు వేయరు – ఆల్రెడీ ప్లకార్డులు పట్టుకుని రోడ్డు ఎక్కారు
2. ఉద్యోగ ఉపాధ్యాయులు వేయరు – జీతాలే డౌటుగా ఉన్నాయ్ వాళ్ళకి
3. పధకాల ప్రభావం ఉంది అంటున్నారు కదా, పధకాలు చాలా మందికి పోయాయి – వాళ్ళ సంగతి చెప్పండి మరి?
4. జగన్ మందు పంచుతాడు అంటున్నారు – మందు రేట్లు ఎలా పెరిగాయో తాగుబోతులకి తెలవదా?
5. జగన్ కోర్ వోటింగ్ అయిన లేబర్ వేయరు – ఇసుక, సిమెంట్ ఎఫెక్ట్
6. నిరుద్యోగులు వేయరు – విశాఖ గ్లోబల్ సమ్మిట్ చూశాక న్యూట్రల్స్ కి కూడా అర్ధం అయింది.
7. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్వాడీ వాళ్ళు 2019 లో చాలా నమ్మారు. జగన్ ని ఈసారి నమ్ముతారా? ఏం చేశాడు వాళ్ళకి?
8. బిల్లులు రాని కాంట్రాక్టర్లు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు..100% జగన్ కే వేస్తారా?
ఈ లెక్కలో ఈసారి జగన్ 35 నుంచి 37% ఓట్లకి పరిమితం అవుతాడు. సాలిడ్ గా జగన్ కి పడే ఓట్లు ఎవరివి అంటే.. ఎవడెటు పోతే నాకెందుకు నాకు పధకాలు వచ్చాయి, నాకు పనులు జరిగాయి, కమ్మ కులం అధికారంలోకి రాకూడదు అనే బ్యాచ్ మాత్రమే.