2019లో ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. కొత్త ఇసుక పాలసీ పేరుతో జగన్ ఇసుక దోపిడీకి తెరతీయడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. జగన్ అపరిపక్వ నిర్ణయంతో భవన నిర్మాణ కార్మికులతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పలు రంగాల కార్మికులు రోడ్డున పడ్డారు. అయినా సరే జగన్ మాత్రం వారి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. కట్ చేస్తే, జగన్ ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించడంతో ఆయన ఓడిపోయారు. భవన నిర్మాణ కార్మికులతో పాటు ప్రజంతా కావాలని ఎన్నుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
తాను జగన్ మాదిరి కాదు అని నిరూపిస్తూ ఇసుక ఫ్రీ పాలసీని ప్రకటించారు. అంతేకాదు, భవన నిర్మాణ కార్మికుల భుజంపై చేయి వేసి వారికి వెన్నతట్టారు. వారితో కలిసి ఫొటోలు దిగి మీకు నేనున్నాను అని భరోసానిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల ముఠామేస్త్రి గా ఉన్న చంద్రబాబు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులతోపాటు నిర్మాణ సామాగ్రి రవాణా కార్మికులు(తోపుడు బండి నుండి. లారీల వరకు), సిమెంటు, స్టీలు వ్యాపారస్తులు. కలప వ్యాపారస్తులు మరియు వడ్రంగి కార్మికులు. ఎలక్ట్రికల్ సామాగ్రి వ్యాపారస్తులు మరియు ఎలక్ట్రీషియన్స్. పెయింట్స్ వ్యాపారస్తులు మరియు పెయింటర్స్. టైల్స్ వ్యాపారస్తులు మరియు టైల్స్ లేయింగ్ కార్మికులు. ప్లంబింగ్ కార్మికులు కూడా లబ్ధిపొందుతారన్న సంగతి తెలిసిందే.