సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. శుక్రవారం రాత్రికి ఆయన కేంద్ర మంత్రులతో ఢిల్లీలో భేటీ కాను న్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు నేరుగా ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కారు. ఇక, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. మరికొద్ది సేపటి తర్వాత.. పిఠాపురం నుంచి నేరుగా గన్నవరం చేరుకున్నారు. అనంతరం ఆయన ఇక్కడ నుంచినేరుగా బెంగళూరుకు వెళ్లే.. విమానం ఎక్కి వెళ్లిపోయారు. ఇద్దరు నేతల పయనా నికి మధ్య అరగంట గ్యాప్ ఉంది.
రాష్ట్రం కోసం ఒకరు..
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదలు, వర్షాల కారణంగా భారీ నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరుతున్నారు. రాష్ట్రంలో సంభవించిన విపత్తును జాతీయ విప త్తుగా పరిగణించాలని ఆయన కోరుతున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలకు కూడా అదే విషయం చెప్పారు. ఇక, ప్రాథమికంగా వచ్చిన నష్టం రూ.6880 కోట్ల వరకు ఉందని పేర్కొంటూ.. నివేదకను కూడా కేంద్ర హోం శాఖకు పంపించారు.
అయితే.. నివేదికలు పంపించినా.. కేంద్ర బృందాలకు చెప్పినా.. ఫలితం ఎలా ఉంటుందోననే ఆందోళన చంద్రబా బుకు ఉంది. తానే వెళ్లి నేరుగా ఇక్కడ ఏం జరిగిందో వివరించి.. సొమ్ములు రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడి మంత్రులు, అధికారులతో ఆయన వరుస భేటీలు నిర్వహించి.. రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లారు.
ఇక, జగన్ విషయానికి వస్తే.. ఈయన వీకెండ్ ఎంజాయ్ మెంట్ కోసం.. బెంగళూరుకు వెళ్లారని తెలుస్తోంది. గత వారం కూడా ఇలానే శనివారం, ఆదివారం బెంగళూరులోనే గడిపి వచ్చారు. రాష్ట్రంలో వరదలు వచ్చి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా.. జగన్ మాత్రం వీకెండ్ వేళ బెంగళూరులోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన అందుకే వెళ్లారనేది పార్టీ వర్గాల మాట.