భారతదేశం సనాతన ధర్మానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో వివిధ మతాల వారు, కులాల వారు తమ తమ ఆచారాలు, పూజలు తప్పకుండా పాటిస్తుంటారు. సామాన్యుల నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ సంప్రదాయాలను, ఆచారాలను పాటించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ స్థానిక ఆచారాన్ని పాటించడం సంచలనం రేపుతోంది.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బాఘెల్ అక్కడి ఆచారం ప్రకారం కొరడా దెబ్బలు తిన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్ గఢ్ లో దీపావళి సందర్భంగా పండుగ ముగిసిన మరుసటి రోజు గోవర్ధన్ పూజ నిర్వహిస్తుంటారు. గౌరీ దేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత భక్తులంతా ఆచారం ప్రకారం కొరడా దెబ్బలు తింటుంటారు. ఇలా చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని గ్రామస్థుల విశ్వాసం. అలా దెబ్బలు తింటే మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం.
ఈ క్రమంలోనే దుర్గ్ జిల్లాలోని జజంగిరి గ్రామంలో జరిగిన గౌరీ పూజలో బాఘెల్ పాల్గొన్నారు. ఈ పూజ అయిపోయిన తర్వాత అందరు సామాన్య భక్తుల్లాగే బాఘెల్ కూడా కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బాఘెల్ కోరుకున్నారు. ఏది ఏమైనా…సామాన్యుడిలా కొరడా దెబ్బలు తిన్న సీఎం బాఘెల్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
सोंटे का प्रहार और परंपराओं का निर्वहन. pic.twitter.com/SV82qommmu
— Bhupesh Baghel (@bhupeshbaghel) October 25, 2022