సినిమా వాళ్లను అందరూ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వారి ఇమేజ్ పాడవుతుందన్న భయంతో ఎదురుతిరగరు. ప్రతి పనికిమాలిన వార్తకు స్పందించరు. అందకే మీడియాకు వారు సాఫ్ట్ టార్గెట్స్ అన్న పవన్… అసలు సినిమా వాళ్లు ఎంతో కష్టపడితే గాని డబ్బులు రాలవని, చాలా ట్యాక్సులు కడతామని చెప్పుకువచ్చారు.
సినిమాలో దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకుంటున్నారని అందరూ అంటుంటారు. వాళ్లకు చెప్పేదొక్కటే.. హీరోలు కానీ, దర్శకులు కానీ, హీరోయిన్స్ కానీ, వీళ్లు లెక్క చెబుతారు.
ఉదాహరణకు హీరోకు పదికోట్లు పంపితే అందులో ఒక కోటి ట్యాక్స్ కట్ చేసుకునే పంపుతారు. పన్నులు పోగా.. ఆరున్నరకోట్లు మిగులుతాయి. దీంట్లో వాళ్లు వ్యవస్థను నడుపుకోవాలి. ఆ డబ్బులు ఊరికే రాలేదు. దోచింది కాదు. వాళ్ల కష్టం మీద వచ్చిందే.
రాజకీయ నేతల్లా వేలకోట్లు దోచేయలేదు. దొంగ క్రాంటాక్టులు చేసి సంపాదించలేదు. ఎంటర్టైన్ చేసి సంపాదిస్తున్నాం. డాన్సులేసో, కిందపడో, మీద పడో, ఒళ్లు విరగొట్టుకునో చేస్తున్నాం.
బాహుబలిలో ప్రభాస్‌గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే, రానాగారిలాగా కండలు పెంచి కష్టపడితేనే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్‌లా అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. ఒకరోజులో ఎవరికీ ఇవ్వలేదు. రామ్‌చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తారు. దేన్నైనా తెగేదాకా లాక్కండి అని అందరికీ చెబుతున్నాను అంటూ సినిమ వాళ్లకు డబ్బులు ఊరికే రావు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.