సీఎం కావల్సిన చిరంజీవి చివరకు పేర్ని నాని వంటి ఒక సాధారణ మంత్రిని బతిమలాడుకుంటున్నారు. అయ్యా ప్లీజ్ టిక్కెట్ ధరలు పెంచండయ్యా ప్లీజ్ అని బతిమలాడుకుంటున్నారు.
ప్రైవేటుగా కాదు… బహిరంగంగా ట్విట్టరులో జగన్ పేరు చెప్పి అడుగుతున్నాడు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు అంతా ప్రభుత్వ అసమర్థతపై తిట్టిపోస్తున్నారు. సినిమా వాళ్లపై జగన్ పగ తీర్చుకుంటున్నారని జనం అనుకుంటున్న సమయంలో చిరంజీవి ఇలా బతిమలాడటం వల్ల ప్రజల్లో సానుభూతిని కోల్పోతున్నారు.
సర్లే అది పక్కన పెడితే చిరంజీవి ఇతర సినీ పెద్దలు బతిమలాడారని… జగన్ ని అడిగి నిర్ణయం వెల్లడిస్తామని పేర్ని నాని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న సినిమా టిక్కెట్ల ఛార్జీలను కొనసాగించాలని చేసిన అభ్యర్థనపై జగన్ తో మాట్లాడతాను అని వైఎస్ఆర్సిపి మంత్రి పేర్ని నాని స్పందించారు.
మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.
హీరో చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు తమను సంప్రదించారని… జిఒ నెం 35లో మార్పులు చేయాలని కోరారని పేర్ని నాని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా సిఎం జగన్తో చర్చించలేదని, సినిమా టిక్కెట్టు ఛార్జీల పెంపుపై సిఎంతో చర్చిస్తానని చెప్పారు.