రీల్ స్టార్ల జీవితాలు సామాన్యులకు చాలా భిన్నంగా ఉంటుంది. బిజీ బిజీగా ఉండటంతో పాటు.. వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారని తెలిసిందే.
గతంలో గుప్త దానాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తన అభిమానులకు అవసరమైన ఏర్పాట్లు చూడటంతో పాటు.. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి.. ఎంతోమందికి ప్రాణదానం చేశారు.
అలాంటిచిరు గురించి ఒక ఆసక్తికర మైన విషయాన్ని చెప్పటమే కాదు.. చిరు కానీ లేకుంటే.. ఆ రోజున ఆమె పరిస్థితులు దారుణంగా ఉంటాయన్న మాటను చెబుతున్నారు నటుడు రాజా రవీంద్ర.
కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడిన వేళ.. రాస్ట్రంలో పెద్ద ఎత్తున ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో .. అందుకు తగ్గట్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆక్సిజన్ కేంద్రాల్ని ఏర్పాటుచేశారు. అంతేకాదు.. తన కారణంగా లబ్ధి పొందిన వారి గురించి పెద్దగా బయటకు చెప్పుకోవటం ఆయనకు ఎక్కువ ఇష్టం ఉండదని చెబుతారు.
తాజాగా రాజా రవీంద్ర ఓపెన్ కావటమే కాదు.. చిరుకు సంబంధించిన ఒక గొప్ప సాయాన్ని గుర్తు చేసుకున్నారు. టైమ్లీగా చిరు స్పందించకుంటే హేమ నిజంగానే చనిపోయేదన్న మాట వినిపిస్తోంది.
నటి హేమకు డెలివరీ సమయంలో బ్లడ్ కావాల్సి వచ్చింది. ఆమెది ఓ నెగిటివ్ గ్రూప్ కావటం.. రేర్ గా దొరికే పరిస్థితి. ఆ సమయంలో దేవుడి మాదిరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్లే హేమ బతికినట్లు పేర్కొన్నారు.
‘ఆ రోజున చిరంజీవి బ్లడ్ బ్యాంకులో కోరుకున్న బ్లడ్ దొరికింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకు వల్లే ఆమె పుట్టింది. లేకుంటే చనిపోయేది. రక్తం అవసరం ఉన్న వారికే తెలుుస్తోంది. బ్లడ్ బ్యాంక్ నడపటం అంత తేలికైన విషయం కాదు.
అందుకోసం నెల వారీగా లక్షల ఖర్చు అవుతుంది’ అని పేర్కొన్నారు. అలా బ్లడ్ బ్యాంక్ తో చిరంజీవి చేసిన మంచిని అందరికి తెలియజేస్తామని వ్యాఖ్యానించారు. గుట్టుగా చేసిన సాయం ఏదైనా సరే.. ఏదో రోజున బయటకు వస్తుందన్న మాటకు నిదర్శనంగా తాజా ఉదంతం ఉందని చెప్పక తప్పదు.