ఏపీలో ఎన్నికల హీటు రాజుకుంది. గత ఎన్నికల్లో టీడీపీలో టాప్ లీడర్లను రకరకాల ఈక్వేషన్లతో ఓడించిన జగన్ ఈ సారి చాలా చోట్ల ఎన్నికలకు మూడు నెలల ముందే చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితి. గత ఎన్నికల్లో దెందులూరులో టీడీపీ ఫైర్‌బ్రాండ్ చింతమనేని ప్రభాకర్‌ను ఓడిచేందుకు జగన్ ఎన్నో కుటల ప్రయత్నాలు, గేమ్స్ ఆడారు. చివరకు లండన్ నుంచి తీసుకొచ్చి కొఠారు అబ్బయ్య చౌదరిని పోటీకి పెట్టగా ఆయన విజయం సాధించారు.
ఐదేళ్లలో దెందులూరులో ఎంత అభివృద్ధి జరిగింది ? ఎన్నో కంపెనీలను తీసుకువచ్చి వందలాది ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన మాటలు ఏమైపోయాయన్నది చూసుకుంటే కనిపించేది శూన్యం. 2019కు పదేళ్లముందు జరిగిన అభివృద్ధితో పోల్చి చూస్తే గత ఐదేళ్లలో దెందులూరు చాలా వెనకపడిపోయింది. ఈ సారి దెందులూరు ఓటరు ధృక్పథం మారిపోయింది. చింతమనేనిని ఓడించుకుని మన అభివృద్ధిని మనమే కాలదన్నుకుని వెనకబాటుకు గురయ్యామన్న భావన వచ్చేసింది.
చింతమనేని కూడా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ సారి కసితో ఉన్నారు. గత ఎన్నికల తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అవగతం చేసుకుని మరీ ఈ సారి ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ సారి బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర ఓసీ వర్గాల్లోనూ చింతమనేని పట్ల బాగా సానుకూలత వ్యక్తమవుతోంది. చింతమనేని మాట తీరు కరుకుగా ఉండొచ్చు.. కానీ మనసు వెన్న అన్నది ఎవరిని అడిగినా చెపుతారు. చింతమనేని పట్ల సానుభూతి బాగా పెరిగింది.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా చింతమనేని విక్టరీ ఈ సారి పక్కా అన్న టాక్ దెందులూరులో గ్రామగ్రామానా వచ్చేసింది.
చింతమనేని గ్రాఫ్ దెబ్బతో ఫలించని జగన్ ఎత్తులు…
ఈ సారి దెందులూరులో గెలవలేమని డిసైడ్ అయిన జగన్ అసలు అబ్బయ్య చౌదరిని పక్కన పెట్టేయాలని కూడా ఒకానొక దశలో నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. దెందులూరు సీటును బీసీలకు ఇవ్వాలన్న చర్చ పార్టీలో జరిగింది. ఇందుకోసం రకరకాల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. అయితే 2014లో ఇక్కడ బీసీ ప్రయోగం విఫలమైంది. పైగా జగన్ తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలో ఉన్న కొందరు బీసీ నేతలు కూడా పార్టీకి దూరమయ్యారు.
చివరకు ఎన్ని ఈక్వేషన్లు వేసినా ఉపయోగం లేదని తేలడంతో అబ్బయ్య చౌదరినే కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే బీఫామ్ ఇచ్చేవరకు కూడా దెందులూరు విషయంలో జగన్ డెసిషన్ ఎలా ఉంటుందో ఎవ్వరి ఊహలకు అందడం లేదు. ఏదేమైనా ఈ సారి దెందులూరులో చింతమనేని చేసే రీ సౌండ్ దెబ్బకు జగన్ అదిరిపడే వాతావరణమే గ్రౌండ్లో కనిపిస్తోంది. ఈ సారి ఇక్కడ వైసీపీకి అంత సీన్ లేదని ఆ పార్టీ నేతలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.