• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చైనా పరువు తీసిన వీడియో… ప్రపంచ వ్యాప్తంగా వైరల్

NA bureau by NA bureau
May 6, 2022
in Around The World, India, Top Stories
0
భారత్ లో గ్రామాలకు చైనా పేర్లా ?
0
SHARES
290
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒక్కో రోగానికి ఒక్కో మందు ఉంటుందన్నది అందరికి తెలిసిందే. కరోనా విషయంలోనూ అంతే. ఈ చిన్న విషయం చైనా పాలకులకు ఎందుకు తెలీటం లేదు? కరోనా మహమ్మారికి పుట్టిల్లుగా చెప్పే చైనాలో.. దాన్ని ఎలా డీల్ చేయాలనే విషయం మీద చైనా ఎందుకు తప్పటడుగులు వేస్తోంది.

ప్రపంచానికి పీడ పట్టించి.. రెండేళ్లు ఆగమాగం చేసేసిన డ్రాగన్ దేశం.. కరోనా విషయంలో ఎలా అయితే వ్యవహరించకూడదో అలానే వ్యవహరిస్తుండటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఎవరెన్ని చెప్పినా.. ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనాకు ఉన్నవి రెండే పరిష్కార మార్గాలు.

కరోనా నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదన్నది తేలిపోయిన తర్వాత.. దాన్ని నియంత్రించే రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం.. అందుకు వ్యాక్సినేషన్ సాయం చేస్తుంది. మరో మార్గం.. కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి చెందటం.. అప్పుడు ఆటోమేటిక్ గానే రోగ నిరోధక శక్తి వస్తుంది. రెండో విధానం విన్నంతనే దారుణంగా అనిపిస్తుంది కానీ.. మన దేశాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నప్పుడు మాత్రం.. ఈ రెండు కలగలిసిన కారణంగానే.. మూడో వేవ్ ను ఎదుర్కోగలిగామని చెప్పాలి.

ఇందుకు భిన్నంగా కొవిడ్ జీరో పేరుతో.. కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యంతో ముంచెత్తటంతో పాటు.. ఇంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయా? అన్న పరిస్థితి ఎదురవుతోంది. కొవిడ్ శాంపిళ్ల సేకరణ పేరుతో దాడులు చేయటం.. బలవంతంగా శాంపిళ్లు తీసుకోవటం.. లాక్ డౌన్ పేరుతో ఇంట్లో ఉండే వారు కూడా సన్నిహితంగా ఉండకుండా డ్రోన్లతో పహరా కాయటం లాంటివి చేష్టలతో చైనీయులు విసిగిపోతున్నారు.

కొవిడ్ శాంపిళ్ల పేరుతో ఇనుప రాడ్లతో బంధిస్తున్న  తీరు చూస్తే.. ఇదెక్కడి క్రూరత్వం.. మనషుల్లో ఉండాల్సిన మానవత్వం ప్రాథమికంగా కూడా లేకుండా పోయిందేనన్న భావన కలుగక మానదు. లాక్ డౌన్ ను విధించిన ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు.. గేట్లకు ఇనుప రాడ్లతో వెల్డింగ్ చేస్తున్నారు. కొవిడ్ కట్టడి పేరుతో ప్రభుత్వం చేస్తున్న దారుణాలకు నిలువెత్తు నిదర్శనంగా ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ నుంచి శాంపిల్ సేకరించేందుకు ఆమెను ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో అర్థమవుతుంది.

షాంఘై లాంటి నగరాల్లో భారీ ఎత్తున కోవిడ్ టెస్టులు నిర్వహించడం.. ఈ క్రమంలో తన శాంపిల్ ఇచ్చేందుకు నో చెప్పిన ఒక మహిళను బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. ఆమె మీదకి ఎక్కి.. బలవంతంగా ఆమె నోరును తెరిచి.. శాంపిల్ తీసుకుంటున్న తీరు చూస్తే.. మరీ ఇంత క్రూరంగానా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t

— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022

కరోనాకు చెక్ పెడతామన్న పేరుతో చైనా అధికారులు చేస్తున్న ఆరాచకాలపై ఇంత కాలం మౌనంగా ఉన్న చైనీయులు పలువురు.. ఇప్పుడు గళం విప్పుతున్నారు. కొందరు వీధుల్లోకి వచ్చిన నిరసన ప్రదర్శనలు చేస్తుంటే.. మరి కొందరు సోషల్ మీడియాలో గుట్టుగా ప్రభుత్వ విధానాల్ని తూర్పార పడుతూ షాకింగ్ వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ.. ప్రపంచానికి చైనా ఆరాచకాలు ఎంతలా ఉంటాయన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తున్నారు. ఎప్పటిలానే వీధుల్లోకి వచ్చి నిరసన చేస్తున్న వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తంగా జీరో కొవిడ్ ఏమో కానీ.. అధికారుల దెబ్బకు చైనీయులు మాత్రం కుతకుతలాడిపోతున్నారు.

Tags: chinachina covid casesCoronacovidCovid 19
Previous Post

ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి?

Next Post

అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ ‘యాదాద్రి’ పునర్నిర్మాణం!

Related Posts

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
Andhra

అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?

May 16, 2022
బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
Movies

బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ

May 16, 2022
టీడీపీలోకి ఆ మాజీ మంత్రి?..చంద్రబాబుతో భేటీ
Andhra

త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్

May 16, 2022
ప‌వ‌న్‌పై వైసీసీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ టార్గెట్ ?
Andhra

ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !

May 16, 2022
ఆ నేతలకు క్లాసు పీకిన చంద్రబాబు
Andhra

కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్

May 16, 2022
అల్లు అరవింద్ పై బాలయ్య షాకింగ్ కామెంట్లు
Movies

ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1

May 16, 2022
Load More
Next Post
అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ ‘యాదాద్రి’ పునర్నిర్మాణం!

అధ్వానపు ప్లానింగుకు అతి చక్కని ఉదాహరణ 'యాదాద్రి' పునర్నిర్మాణం!

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds