సరిహద్దుల్లో డ్రాగన్ దూకుడు పెంచుతోంది. భారత్-టిబెట్ సరిహద్దుల్లో ఏకంగా బుల్లెట్ రైలునే ప్రారంభించేసింది. టిబెట్ రాజధాని లాసా నుండి 435 కిలోమీటర్ల దూరంలో ఉన్న నింగ్చికి బుల్లెట్ రైలును ప్రారంభించింది. నింగ్చి అనే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో ఉంది. ఒకవైపు టిబెట్ తమదే అరుణాచల్ ప్రదేశ కూడా తమదే అని ఎప్పటి నుండో చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.
చైనా వాదనను ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికలపై కేంద్రప్రభుత్వం తిప్పికొడుతున్నా డ్రాగన్ మాత్రం తన పట్టును విడవటంలేదు. జమ్మూ-కాశ్మీర్లో చిచ్చు పెట్టడం, సరిహద్దులను ఆక్రమించుకునే టార్గెట్ తో లడ్డాఖ్ లోయ తదితర ప్రాంతాల్లో డ్రాగన్ సైన్యం ఎన్ని గొడవలు చేస్తోందో అందరు చూస్తున్నదే. ఎక్కడవకాశం ఉంటే అక్కడల్లా గోల చేస్తున్న చైనా మళ్ళీ భారత్ సైన్యమే తమపై దాడులకు దిగుతోందంటు ఇల్లెక్కి అరవటం చైనాకే చెల్లింది.
ఇలాంటి నేపధ్యంలోనే తాజాగా 435 కిలోమీటర్ల బుల్లెట్ రైలు మార్గం వేసేయటం సంచలనంగా మారింది. బుల్లెట్ రైల్ మార్గంపై టిబెట్ ప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు చెప్పినా చైనా ఏమాత్రం లెక్కచేయలేదు. టిబెట్టూ తమదే ధక్షిణ టిబెట్ లోని అరుణాచల్ ప్రదేశ కూడా తమదే అంటున్న డ్రాగన్ అదే తెంపరితనంతో ఏకంగా బుల్లెట్ రైలు మార్గాన్నే నిర్మించేసింది.
సరిహద్దుల్లో భద్రతను పరిరక్షించటంతో పాటు సైన్యాన్ని వేగంగా ట్రాన్ పోర్టు చేయటానికి బుల్లెట్ రైలు ఎంతో కీలకంగా మారబోతోంది. మొన్నటివరకు చెంగ్డూ-లాసా మధ్య ప్రయాణానికి ఇపుడు 48 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు ప్రారంభమైతే ఈ దూరాన్ని కేవలం 13 గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తానికి డ్రాగన్ తో మనకు ఎప్పటికైనా సమస్యే అనటంలో సందేహమేలేదు