టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్, హీరో బెల్లంకొండ సురేశ్ లపై చీటింగ్ కేసు నమోదైంది. సినిమా నిర్మాణం కోసం తన దగ్గర నుంచి తీసుకున్న రూ.85 లక్షలు తిరిగి చెల్లించలేందంటూ బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి చీటింగ్ కేసు పెట్టారు. 2018లో రూ.50 లక్షలను సురేశ్ అప్పుగా తీసుకున్నారని, ఆ తర్వాత మరో సినిమా కోసం రూ.35 లక్షలు తీసుకున్నారని శరణ్ ఆరోపించారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదంటూ శరణ్ కోర్టును ఆశ్రయించగా…పోలీసులు బెల్లంకొండ సురేశ్, శ్రీనివాస్ లపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
బెల్లంకొండ సురేశ్ నిర్మాణంలో ఓ దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. దీంతో, ఆ చిత్రానికి వ్యాపార భాగస్వామిగా ఉండాలని శరణ్ కు సురేశ్, శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చారు. దీంతో, రెండు విడతలుగా వారికి శ్రవణ్ మొత్తం రూ.85 లక్షలు చెల్లించారు. అంతేకాదు, యూనిట్ మెంబర్లకు కూడా కొంతమొత్తం చెల్లించారు. కానీ, బెల్లంకొండ సురేశ్ చిత్ర నిర్మాణానికి ఏర్పాట్లు చేయకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని కోరారు.
అయితే, డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తనను బెదిరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. దీంతో, శరణ్ న్యాయం చేయాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కేసు … బెల్లంకొండ సురేశ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.
ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేశ్ స్పందించారు. తన పరువు తీయడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారని, శరణ్ పై పరువు నష్టం దావా వేస్తానని, లీగల్ గా ఎదుర్కొంటానని చెప్పారు. ‘వాడిని వదిలేది లేదు…వాడికి నరకం చూపిస్తా’నంటూ వార్నింగ్ ఇచ్చారు.
తనకు శరణ్ ఎన్నడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. తనకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే పోలీసులకు అందజేయాలని చెప్పారు. తన కుమారుడు శ్రీనివాస్ హీరోగా ఎదిగాడని, ఆ ఇమేజ్ చెడగొట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు రాలేదని వివరించారు.