సీఎం జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన జగన్ …కక్షా రాజకీయాలకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. అయినప్పటికీ, అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్….యథేచ్ఛగా టీడీపీ నేతల, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేసి పైశాచికానందం పొందుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇక, ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, శాంతి భద్రతలను కాపాడాలని డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు ఎన్నోసార్లు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇలాకా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేయడం, దాడి చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు మరోసారి లేఖ రాశారు. మురళిపై వైసీపీ గూండాల దాడిని ఖండించిన చంద్రబాబు…ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఫైర్ అయ్యారు.
డిసెంబరు 20న కుప్పంలో మురళిని వైసీపీ రౌడీలు కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత రెస్కో చైర్మన్ జీఎస్ సెంథిల్‌కుమార్ ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించారు. మురళిపై సెంథిల్‌కుమార్, ఆయన అనుచరులు దాడి చేసి చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. మురళి చేత హెచ్ఎం మురుగేష్ గురించి బలవంతంగా వాంగ్మూలం చెప్పించి వీడియో రికార్డ్ చేశారని ఆరోపించారు. మురళిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కొట్టారని అన్నారు.