సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లుగా వరుస దుర్ఘటనలతో రాష్ట్ర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇది రాష్ట్రమా? రావణ కాష్టమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనలపై అధికార పార్టీ దాష్టీకాలపై చంద్రబాబు మండిపడ్డారు. బాలుడి సజీవ దహనం, ఏలూరులో యాసిడ్ దాడి వంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
నెల్లూరు, మచిలీపట్నంలో జరిగిన అత్యాచార ఘటనలపై కూడా సీఎం జగన్ మౌనం వహించడాన్ని చంద్రబాబు తప్పు బట్టారు. రాజకీయ కక్షతో మహిళలను చంపినా ఈ బిడ్డ ఒక్క మాట కూడా మాట్లాడడా అని జగన్ ను నిలదీశారు. జగన్ ప్రజల బిడ్డ అయితే దాడులు చేసిన వారిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. నిజంగా జగన్ ప్రజల బిడ్డ అయితే పేదల ప్రాణాలకు వెల కడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మాట్లాడితే జగన్ మీ బిడ్డ అంటూ ప్రజలనుద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేయడాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. శాంతిభద్రతలపై సీఎం జగన్….పోలీసు ఉన్నతాధికారులతో కనీసం సమీక్ష జరపలేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఇది రాష్ట్రమా? రావణ కాష్టమా అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వీడియో, ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది రాష్ట్రమా….? రావణ కాష్ఠమా..? #RashtramaaRavanaKaashtamaa#NalugellaNarakam pic.twitter.com/q1LAE2f6yT
— N Chandrababu Naidu (@ncbn) June 26, 2023