రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సాధ్య మైనన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసుకుంటోంది. నామినేషన్ల సమయంలోనే.. ఏకగ్రీవాల కోసం.. ప్రయత్నించిం ది. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమలో ఏకగ్రీవాలు అయిపోయాయి. వివిధ కారణాల తో నామినేషన్లను అధికారులు పక్కన పెట్టడంతో వైసీపీ వ్యూహం ఫలించిందని టీడీపీ నేతలు చెబుతు న్నారు.
అయితే.. ఇక మిగిలిన వాటిలో అయినా.. దూకుడు ప్రదర్శించి..వాటిని దక్కించుకోక పోతే.. ఇబ్బంది తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన కసరత్తు ముమ్మరం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీడీపీ – వామపక్షాలు కలిసి ఉమ్మడి గా కృషి చేయాలని బాబు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థులకు, రెండో ప్రాధ్యాన్యం పీడీఎఫ్ అభ్యర్థులకు వేయా లని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇదే పాటించాలన్నారు. అదే సమయంలో తమ రెండో ప్రాధాన్యం ఓటు టీడీపీ అభ్యర్థులకు వామపక్షాలు వేసేలా పరస్పరం ఒక అవగాహనకు వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహం కనుక సక్సెస్ అయితే.. వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమనిఅంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.