వైసీపీ అధినేత, సీఎం జగన్ ఏపీలో ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ 30 వ తేదీ వరకు కూడా ఈ షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత.. 13 రోజుల్లోనే ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలు, మండలాలు చుట్టి వచ్చేలా సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు. వైనాట్ 175 నినాదాన్ని ఆయన వినిపించనున్నారు. అయితే.. ఈ బస్సు యాత్రపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు.
గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ముందు వాటికి సమాదానం చెప్పిన తర్వాతే బస్సు యాత్రకు రెడీ కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు.జగన్ విశ్వసనీయత నేత బీరలో నెయ్యిచందమేనని అన్నారు. ఐదేళ్ల పదవి కాలాన్ని దోచుకునేందుకు వినియోగించుకున్నా రని మండిపడ్డారు. 99 శాతం హామీలను అమలు చేశామని చెబుతున్న సీఎం జగన్ మాటలను ఎవరూ నమ్మరని అన్నారు. అవన్నీ బూటకపు మాటలేనని అన్నారు.
ఏపీని డ్రగ్స్‌కు రాజధాని చేశారని చంద్రబాబు ఫైరయ్యారు. విశాఖ పోర్టులో సీబీఐ 25 వేల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకోవడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనంపై విస్మయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని చెప్పారు.
25 వేల కిలోల స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్ఠానం డ్రగ్స్‌ను తెచ్చినట్లు తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్‌గా మారిపోయిందని మండిపడ్డారు. మన యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఈ సమస్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.