టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వరకు.. కొందరు వైసీపీ నాయకులపై కసి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమను రాజకీయంగా బద్నాం చేస్తున్నారనే ఆవేదనతోపాటు.. భౌతిక దాడులు చేయించారనే బాధ కూడా వారిలో నెలకొందని టీడీపీ నాయకులు తరచుగా అంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ప్రధానంగా వినిపించే పేరు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకే చెందిన నాయకుడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
వాస్తవానికి చంద్రబాబు-పెద్దిరెడ్డి క్లాస్మేట్స్ అంటారు. చిన్నప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం కూడా ఉందని చెబుతారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చేయిచేయి వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని నాటి తరం నాయకులు గుర్తు చేస్తుంటారు. అయితే.. రాజకీయాలు అన్నాక.. మార్పులు సహజం అయితే… పెద్దిరెడ్డి వంటివారి విషయంలో ఈ మార్పు మరింత తీవ్రంగా ఉండి ఉంటుంది. అందుకే.. ఇటు చంద్రబాబు, అటు నారా లోకేష్‌పైనా ఆయన ఒంటికాలిపై లేస్తారని పార్టీ నాయకులు చెబుతుంటారు.
ఇక, ఇటీవల అంగళ్లు ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు ఈ ప్రాంతానికి రాకుండానే పెద్దిరెడ్డి వర్గం అడ్డుకుంది. ఇక, ఇసుక విషయంలో నారా లోకేష్‌ను కూడా పెద్దిరెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. దీంతో పెద్దిరెడ్డిపై నారా లోకేష్ క్రిమినల్ కేసు కూడా దాఖలు చేశారు. ఇదిలావుంటే.. అసలు పెద్దిరెడ్డిపై కసి తీర్చుకోవాలంటే.. ఈ మార్గం కాదని అంటున్నారు సీనియరనాయకులు. పుంగనూరులో ఆయన సొంత నియోజక వర్గంలోపెద్దిరెడ్డి ఓడించడమే సరైన మార్గమని వారు ఇటీవల చెప్పుకొచ్చారు.
గత మూడు ఎన్నికల్లోనూ పుంగనూరులో తిరుగులేని విజయం సొంతం చేసుకున్నారు పెద్దిరెడ్డి. 2014, 2019లో అయితే.. ఏకంగా లక్ష ఓట్ల పైచిలుకు సంపాయించుకుని విజయం దక్కించుకున్నారు. ఈయనను ఓడించేందుకు.. అంతే బలమైన నాయకుడిని ఇక్కడ ఎంచుకోవడం ద్వారా.. గట్టి పోటీ ఇచ్చి ఓడించాలని.. తద్వారా.. పెద్దిరెడ్డిపై కసి తీర్చుకోవాలనేది సీనియర్ల మాట.
కానీ, టీడీపీ తరఫున పోటీ చేసిన.. గత రెండు ఎన్నికల్లోఅభ్యర్థులు కూడాపెద్దిరెడ్డిపై అంత తీవ్రంగా పోరాటం చేయలేక పోయారు. 2014లో టీడీపీకి ఇక్కడ 72856 ఓట్లు రాగా, గత 2019లో 63836 ఓట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోబలమైన అభ్యర్థిని ఎంపిక చేసి కసి తీర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి ప్లాన్ చేస్తారో చూడాలి.