వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ బాధ్యత లేని వ్యక్తి అని.. మోసాలు చేయడంలో దిట్ట అని స్పష్టం చేశారు. టీడీపీది జనబలమని ఈ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో రామగోపాల్‌రెడ్డి గెలుపు ప్రజా విజయమన్న చంద్రబాబు.. ప్రజా తీర్పును ప్రభుత్వ తిరుగుబాటుగా చూడాలన్నారు. చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఓట్లు వేశారని.. భవిష్యత్‌లో టీడీపీదే విజయమని తెలిపారు.
ఉగాది పంచాంగాన్ని రెండ్రోజుల ముందే ప్రజలు చెప్పారని చంద్రబాబు స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడారు. నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారన్నారు. మంచి గెలుస్తుంది.. చెడు ఎప్పుడైనా ఓడిపోతుందని ప్రజలు నిర్ణయించారన్నారు. ఇక జగన్ పని అయిపోయిందని… ఆయన మళ్లీ ఏ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు.
జగన్‌కు బాధ్యత లేదని.. మోసాలు చేయడంలో దిట్ట అని స్పష్టం చేశారు. టీడీపీది జనబలమని, తాత్కా లికంగా ఇబ్బందులున్నాయని,.. జగన్‌ది ధనబలం.. రౌడీయిజం.. ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు. జగన్ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకెళ్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని చంద్రబాబు అన్నారు.
నాలుగేళ్లలో రాజకీయ పార్టీలు పనిచేసే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని… ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేసే పరిస్థితి లేదన్నారు. జగన్.. అరాచకాలు, విధ్వంసం, ద్రోహం చేశారన్నారు. కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు.. గాలికి వచ్చిపోతుంటాయని వైసీపీ గురించి చంద్రబాబు ప్రస్తావించారు.
పులివెందులలో తిరుగుబాటు!
పులివెందులలోనూ తిరుగుబాటు ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. జగన్ నేరాల్లో అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లను జైలుకు పంపారని… జగన్‌ను నమ్ముకున్న వారిని జైలుకు పంపారన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు.. ఆయనొక్కరే ఉండాలనేది జగన్ మనస్తత్వం అని అన్నారు.