ఖబర్దార్ జాగ్రత్త మీరు రాజకీయ సన్యాసం తీసుకునే వరకూ వదిలి పెట్టను – చంద్రబాబు ???? pic.twitter.com/t6MtFFMqxD
— I Love India✌ (@Iloveindia_007) May 4, 2022
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా ధరాభారం ఉందంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనేందుకు జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియో జకవర్గం దల్లవలస గ్రామంలో చంద్రబాబు నిరసన కార్యక్రమం చేపట్టారు.
పార్టీ కేడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు, వివిధ ఛార్జీల పెంపు, పన్నుల భారాలతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాడేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృతంగా జిల్లాల్లో పర్యటించనున్నారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా,,దళ్ళవలస గ్రామంలో తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు పాల్గొన్న బాదుడే బాదుడు కార్యక్రమంలో వేదికపై ఘర్జించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ కిమిడి నాగార్జున pic.twitter.com/MAS1rhLtuj
— Vempadapu Ramurthy (@VempadapuRamur1) May 4, 2022
బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న చంద్రబాబు… అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పొందూరు మండలం దల్లవలస గ్రామం చేరుకుని బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లవలస, గ్రామంలో పర్యటించి.. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ప్రజలకు వివరించిన చంద్రబాబు నాయుడు… రాష్ట్రాన్ని అప్పుల ఆంద్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆరోపించారు.
సంక్షేమ పథకాలు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ..ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసారని జగన్మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. శ్రీకాకుళం జిల్లా నుండి రానున్న ఎన్నికల్లో ప్రచారం మొదలు పెడతానని స్పష్టం చేశారు.. అంతకంటే ముందు శ్రీకాకుళం నగరంలో సీపన్నాయడు పేట జంక్షన్ వొద్ద గల స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. విద్యుత్ చార్జీల పెంపు భారం ప్రజలపై పెట్టి ..రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దక్కిందన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు.
చంద్రబాబు గారి సభలకు వస్తున్న ప్రజలను చూసి వెన్నులో వణుకు పుట్టి, ప్రచారాన్ని లైవ్ రాకుండా కరెంట్ కోత కోసి, జామర్లను పెట్టి సిగ్నల్ రాకుండ చేసి తాడేపల్లి కొంప నుంచి అడుగు బయట పెట్టలేని నువ్వు @ncbn గారిని అడ్డుకుంటావా? నీ పతనం ప్రారంభమైంది @ysjagan pic.twitter.com/NS2I8LndKM
— N Amarnath Reddy (@NAmaranathReddy) May 4, 2022
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు,శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావ్, మాజీ స్పీకర్ కె.ప్రతిభా భారతి, మాజీ ఎమ్మెల్యేలు గుండ అప్పలసూర్యనారాయణ, గౌతు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
అన్ని సీట్లు ఇన్ని సీట్లు అని కాదు రెండు తెలుగు రాష్ట్రాలు , ప్రపంచంలో ఎటు వెళ్ళిన ఆయనకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది…. ఊరికే అవ్వరూ విజనరీ లీడర్ అంటే…. సాహో చంద్రబాబు ✊???????? #BringBabuBack @ncbn @JaiTDP @naralokesh @katchannaidu @RamMNK pic.twitter.com/xDEDz6cCAu
— Vote For Cycle ???? (@anuroopsai) May 4, 2022
https://twitter.com/RapDurga/status/1521907655132184577
జనంతో ఒక్కడు మనలో ఒకడు..
యుగానికి ఒక్కడు పుడతాడు పెద్దాయన..
నీలాంటి వాడు.. జై చంద్రబాబు..❤️????
తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా ????❤️????#CBNInSrikakulam pic.twitter.com/Fohn4HETLs— nageswaran (@nageswaransistl) May 4, 2022