టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. కుప్పం పర్యటనలో ఆయనకు అడుగడుగునా అధికార పార్టీ నాయకులు అడ్డు తగలడం.. పార్టీ నాయకులపై పోలీసులు.. హత్యా యత్నం కేసులు నమోదు చేయడం వంటి విషయాలపై.. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “జగన్ నాతో పెట్టుకోకు.. నీ ఆటలు సాగవ్“ అని నిప్పులు కురిపించారు. తాను పులివెందులలోనే ఉంటానని.. ఏదైనా సరే తేల్చుకుంటానని అన్నారు.
అంతేకాదు.. పోలీసుల సాక్షిగానే అన్న క్యాంటీన్‌పై వైసీపీ మూకలు విరుచుకుపడ్డారని.. చంద్రబాబు తెలిపారు. పోలీసు వ్యవస్థను నడిపించడంలో డీజీపీ పూర్తిగా విఫలమయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుండు సున్నా చుట్టనున్నారని చంద్రబాబు అన్నారు.
పులివెందుల నుంచి రౌడీలను తెచ్చుకున్నా తాను భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంపై జగన్ కట్టారని.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పొరుగున ఉన్న తమిళనాడులో ప్రభుత్వం మారినా.. గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని.. చంద్రబాబు చెప్పారు. జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లను అక్కడ కొనసాగిస్తూ.. పేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. కానీ, మన రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పాలని.. చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని.. రాక్షస పాలనకు ముగింపు పలికేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చంద్రబాబు సూచించారు.
చిన్న పిల్లలు సైతం గొంతు చించుకొని జై బాబు జై జై బాబు, సియం బాబు – సియం బాబు అంటూ నినాదాలు….. అది కుప్పంతో Nara Chandrababu Naidu గారికి ఉన్న అనుబంధం#CBNInKuppam #TDPWillBeBack pic.twitter.com/sUspL5XGMf
— iTDP Unguturu (@ItdpUnguturu) August 26, 2022