విశాఖపై పెత్తనం విజయసాయిరెడ్డిదా?.. సుబ్బారెడ్డిదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చోడవరంలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు.. జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటంకం కలిగించిందని మండిపడ్డారు. టీడీపీ సభలను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయినా మహానాడును సక్సెస్ చేశారని చెప్పారు.
టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వాటికి టీడీపీ కార్యకర్తలు బెదిరే పరిస్థితి లేదన్నారు. వైసీపీని ఇంటికి పంపించే సత్తా ఉత్తారాంధ్రకు ఉందని చంద్రబాబు తెలిపారు.
‘‘ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా?. కోనసీమ రైతులు క్రాప్ హాలిడే దిశగా వెళ్తున్నారు?. సీఎం సొంత జిల్లా కడపలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీన్ని బట్టి వైసీపీ పాలన ఎలా ఉందో అర్ధమవుతుంది.’’ అని చంద్రబాబు అన్నారు. అమ్మఒడి ఏమైందని ప్రశ్నించారు. టీచర్ల వ్యవస్థను సర్వ నాశనం చేశారని విమర్శించారు.
‘‘ ఈ సీఎం ఉన్నంతవరకూ ఎవరూ పెట్టుబడులు పెట్టరు. యువతకు ఉద్యోగాలు రావు. పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. మీ ఇంగ్లీష్ మీడియం ఏమైంది. మనం ఐటీ రంగాన్ని అభివృద్ది చేశాం. ఐటీ రంగంలో యువతకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. జగన్ సర్కార్ హయాంలో వాలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి. 5 వేల రూపాయలకు ఎవరైనా ఉద్యోగం చేస్తారా?. జగన్ పదే పదే ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్క గుంతనైనా చూశారా?. అది వైసీపీ పాలనకు..టీడీపీ పనికి ఉన్న తేడా?.’’ అని చంద్రబాబు తెలిపారు.
Comments 1