రాజ్యాంగం పవర్ లోకి ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాసే విధంగా ఏపీ సీఎం జగన్ తీసుకువచ్చిన జీవవో నెంబరు.1పై పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ జీవోను రద్దు చేయాలంటూ సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ జీవోను ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.
ఈ క్రమంలోనే నేడు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ ఒకటిపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఈనెల 23న జరిపే విచారణ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనను వినిపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏం చెప్పాలన్నా అక్కడే చెప్పుకోవాలని క్లారిటీనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పుపై టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. జీవో నెంబర్ ఒకటి విషయంలో జోక్యం చేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ సర్కార్ కు చెంపపెట్టు అని చంద్రబాబు అన్నారు.
హైకోర్టులో ఈ విషయం విచారణలో ఉండగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని జగన్ వృథా చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, జీవో నెంబర్ 1ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలు వంటి వాటికి సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం వివాదాస్పదం కావడంతో అది చివరకు కోర్టుకు చేరింది.