ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో టీడీపీ యువ నాయకుడు, చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారాలోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. యువగళం పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్రకు మంచి రెస్పాన్సే వస్తోంది. పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక, ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నేతలను కూడా ప్రకటన చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయాలపై నారా లోకేష్ దృష్టి పెడుతున్నారు.
ఇటీవల పలమనేరులో పాదయాత్ర సాగినప్పుడు వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథ్ పోటీ చేస్తార ని చెప్పుకొచ్చారు. ఇక, చంద్రగిరిలో ఒక కీలక కుటుంబానికి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కుప్పం లో చంద్రబాబు విజయం దక్కించుకుంటారని.. గతంలో కంటే కూడా భారీ మెజారిటీ దక్కుతందని తేల్చి చెప్పారు. అయితే. ఎటొచ్చీ.. తిరుపతి నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం నారా లోకేష్ వ్యూహాత్మక మౌనం పాటించారు.
వాస్తవానికి తిరుపతి నియోజకవర్గం నుంచి సుగుణమ్మ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో 2014లో సుగుణమ్మ భర్త వెంకటరమణ పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో భూమన కరుణాకర్‌రెడ్డి ఓడిపో యారు. కొన్ని నెలలకే.. వెంకటరమణ మృతి చెందడంతో వచ్చిన ఉప ఎన్నికలో సుగుణమ్మ పోటీ చేసి విజయందక్కించుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు.
అయితే. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని గెలుస్తానని సుగుణమ్మ చెబుతున్నారు. ప్రజల్లోనే ఉంటున్నట్టు చెప్పారు. అయితే.. దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి పొత్తులో భాగంగా జనసేనకు ఈ టికెట్ ఇచ్చేస్తారని.. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. మరో రీజన్.. సుగుణమ్మకు టికెట్ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో ఏరికోరి ఈ టికెట్‌ను వైసీపీకి అందించడమే అవుతుందని పార్టీ భావిస్తోంది. దీంతో సుగుణమ్మకు లైన్ క్లియర్ కాలేదని తెలుస్తోంది.