అసైన్ భూములు, సశ్మశానం భూముల్లో ఇళ్లపట్టాలిచ్చారు. కొందరు భూములు లాక్కుని ఇళ్లపట్టాలిచ్చారు. కడుపు కాలినడు కోర్టుకు పోతే మా మీద నిందలేసి అబద్ధాలు కూసి ఇంటి పట్టాలు ఇవ్వడాన్ని అడ్డుకున్నాం అంటారా … ఇంత పచ్చి అబద్ధాలతో నిందలేసిన వైసీపీ సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. అయితే, చంద్రబాబు ఈ విషయాన్ని ఇంత లేటుగా ఎందుకు నిలదీశారో అని పార్టీ శ్రేణులు ఆవేదనగా ఉన్నా… ఇపుడు వైసీపీకి సరైన కౌంటర్ ఇచ్చారని సంతోష పడుతున్నారు.
అయినా, మరి టీడీపీ కేసులు వేసి అడ్డుకుందని ఒకవైపు అబద్ధం చెబుతూ ఇంకా కేసులు తేలకుండానే ల్యాండ్ ఇస్తున్నావంటే ఇన్నాళ్లు అబద్ధం చెప్పావని నువ్వే ఒప్పుకున్నట్టు కదా జగన్ అని చంద్రబాబు నిలదీశారు.
68 వేల ఎకరాలను పేదలకు పంచుతాం అంటున్నారు. కోర్టులో ఇబ్బందులు ఉన్న భూమి 2 వేల ఎకరాలు. మరి మిగతా 66 వేల ఎకరాలు ఎందుకు జగన్ పేదలకు పంచలేదు అని చంద్రబాబు నిలదీశారు. ?