విజన్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన టీడీపీ అదినేత చంద్రబాబు ఏం చేసినా.. ఒకపరిపక్వత.. దూరదృష్టి ఖచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం టీడీపీ ఆవిర్భావ సదస్సును తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా టీడీపీ ఇక్కడ పుంజుకుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. చంద్రబాబు వ్యూహానికి ఫిదా అయ్యారు. ఏం చేసినా.. ఏం ఆలోచించినా.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఆవిర్భావ సదస్సును తెలంగాణలో ఏర్పాటు చేయడం .. బాబు విజన్‌కు దర్పణం పడుతోంది.
నిజానికి గత రెండేళ్ల కిందటకు ఇప్పటికి.. టీడీపీలో సమూల మార్పు మాత్రమే కాదు.. అనేక రూపాల్లో సంచలనాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ పార్టీని పరుగులు పెట్టించేందుకు వ్యూహాత్మకంగా చంద్రబాబు వేసిన అడుగులు ఫలిస్తున్నాయి. ఆవిర్భావ సదస్సును వాస్తవానికి విజయవాడలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ, తెలంగాణలో ఉన్న అవకాశాలు.. అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేసిన చంద్రబాబు ఆవిర్భావ సదస్సుకు తెలంగాణ ఉత్తమ వేదిక అని భావించారు. మరుక్షణమే అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈసదస్సు ద్వారాతెలంగాణ లో పార్టీ పుంజుకోవడమే కాదు.. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో లక్ష్యాల నిర్ణయానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ పెట్టాలనే కృత నిశ్చయానికి ఈ ఆవిర్భావ సదస్సు.. ప్రారంభవీచిక కావడం గమనార్హం. అదేసమయంలో వచ్చే మే నెలలో మహానాడును ఏపీలో నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీకి కలిసి వచ్చిన రాజమండ్రి నగరంలో మహానాడును ఏర్పాటు చేయాలని.. రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న దరిమిలా.. ఇక్కడ తూర్పు. పశ్చిమ గోదావరి జిల్లాలను ప్రభావితం చేసేలా .. కార్యక్రమాలు రూపొందించనున్నారు.
అంటే.. ఈ రెండు కార్యక్రమాల ద్వారా.. పార్టీని ముందుకు తీసుకువెళ్లి.. పార్టీ పరంగా.. పుంజుకోవడమే కాదు.. అటు తెలంగాణలోనూ.. ఇటు ఏపీలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావడమనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని.. పరోక్షంగా చంద్రబాబు చెప్పకనే చెప్పారు. మొత్తంగా ఏపీలో మహానాడుకు.. తెలంగాణలో పార్టీ ఆవిర్భావానికి కూడా పావులు కదపడం ద్వారా.. చంద్రబాబు అదిరిపోయే వ్యూహానికి తెరదీశారని అంటున్నారు పరిశీలకులు.