ఏపీలో జరుగుతున్న పరిషత్ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన `బహిష్కర ణ` మంత్రం బాగానే వర్కవుట్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు.
పంచాయతీ, స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ దూకుడు , పోలీసులను వినియోగించి.. టీడీపీ నేతల స్వేచ్ఛను హరించడం, దౌర్జన్యాలు, కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా చేసిన తతంగాలు.. వంటి నేపథ్యంలో చంద్రబా బు తీవ్రంగా మథన చెందారు.
ఇన్ని రకాలుగా వేధిస్తున్నప్పటికీ.. టీడీపీ పోరాడుతోందని.. అయితే.. ఇప్పు డు పరిషత్ ఎన్నికల్లో ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని.. భావించారు. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. చంద్రబాబు పరిష త్ ఎన్నికల బహిష్కరణ ను ఆదిలో చాలా మంది నాయకులు లైట్ తీసుకున్నారు.
పైగా.. అధికార పక్షం నుంచి వ్యంగ్యాస్త్రాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ.. చంద్రబాబు వెనక్కి తగ్గకుండా.. బహిష్కరణకే కట్టుబడ్డారు. కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో తొలుత రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. తర్వాత మాత్రం అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఇక, ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి కానీ.. ప్రజలు మాత్రం గడప దాటడం లేదు.
చంద్రబాబు చేసిన బహిష్కరణ మంత్రం పనిచేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పం చాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా.. వాటి లో ఉన్న ఊపు, ఉత్సాహం.. వంటివి ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదు.
దీనికి కారణం ఏంటి? అనే విషయం పరిశీలిస్తే.. చంద్ర బాబు చేసిన బహిష్కరణ అంశం.. ప్రజల్లోకి బాగానే వెళ్లింది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిన ఆ పార్టీ సానుభూతి పరులు కూడా ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్లారు.
దీంతో వైసీపీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రజల్లోనూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బలంగా నాటుకున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ప్రస్తుత ఎన్నికలపై ప్రజలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి.. బాబు చేసిన ప్రయత్నం.. ప్రభుత్వానికి గట్టి దెబ్బే వేసిందనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.