నరకాసుర పాలన అంతం చేయడానికి శ్రీకృష్ణుడు వస్తున్నాడు అన్నంత ఉత్సాహంగా… చంద్రబాబు వస్తున్నాడనగానే వయసును కూడా లెక్కచేయకుండా ఆనందాన్ని ఈ మహిళలు ఎలా పంచుకుంటున్నారో చూడండి. ఇలాంటి దృశ్యాలు చూసే కదా వైసీపీ మూకల గుండెల్లో గుబులు రేగేది!?#CBNinKuppam pic.twitter.com/zj2Udh0v9L
— Telugu Desam Party (@JaiTDP) October 29, 2021
వైఎస్ కుటుంబం రాష్ట్రంలో అందరి పన్నులు డబ్బులు తీసుకెళ్లి ఆ పులివెందుల్లో పోస్తారు.
టీడీపీ అధ్యక్షుడు, చంద్రబాబేమో ఎవరైనా ఏమనుకుంటారో ఏమో అని అందరూ సమానం అందరూ సమానం అంటూ తన సొంత నియోజకవర్గానికి ఏమీ చేయకుండా కుప్పం ప్రజల్లో నిరాశకు కారణం అయ్యారు.
దీంతో అక్కడ పేరుకున్న నిరాశను అర్థం చేసుకోవడానికి ఇపుడు బాబు ప్రయత్నిస్తున్నారు.
అందుకే ఇటీవల వరుసగా కుప్పం టూర్లు పెట్టుకుంటున్నారు.
తాజాగా మరోసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ను ఎవరు దూషించారో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
వైఎస్సార్సీపీ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని, అందుకే రాష్ట్రానికి నాయకత్వం వహించే అర్హత లేదని ఆయన మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంటు బిల్లు పెంచిందని, చెత్తకు కూడా పన్నువేసి సామాన్యులను పిండేసిందని విమర్శించారు.
ఈ సందర్భంగా 8 అంశాలపై చంద్రబాబు సవాళ్లు విసిరి వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అవేంటో ఈ వీడియోలో చూడండి.