విజన్ 2020….ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. 20 ఏళ్ల తర్వాత జరగబోయే అభవృద్ధికి ముందుగానే ప్రణాళికలు రచించడం, అందుకు తగ్గట్లు సంస్కరణలు చేపట్టడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఈ రోజు ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ కంటూ ఓ పేజీ ఉందంటే అది చంద్రన్న చలవేనని తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్వయంగా చాలాసార్లు పలు వేదికలపై చెప్పారు.
తెలంగాణలో హైటెక్ సిటీతో 2020 విజన్ పునాదులను 1999లోనే చంద్రబాబు వేశారు. ఆ దార్శనీకుడు ఆనాడు నాటిన విత్తనం ఫలాలనే నేడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. ఐటీ అంటే ఏంటీ అనే రోజుల్లోనే బిల్ గేట్స్ వంటి దిగ్గజంతో చంద్రబాబు ఐటీ రంగంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా భారత్ లో టెస్లా కంపెనీ ఏర్పాటుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు విజన్ మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ రోజు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలన్నీ టెస్లాను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కానీ, 2017లోనే నాటి సీఎం చంద్రబాబు…టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో ఏపీలో కంపెనీ ప్రారంభం గురించి చర్చించారన్న విషయం అతి కొద్దిమందికే తెలుసు. తెలంగాణ,మహారాష్ట్ర, పంజాబ్ కంటే ఐదేళ్ల ముందే టెస్లా కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మాస్క్ తో 2017లోనే చంద్రబాబు లైజనింగ్ చేశారు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీ వేదికపై సంప్రదాయ విద్యుత్, నిల్వలు, ఇంటర్ నెట్ తదితర అంశాలపై టెస్లాతో ఏపీ సర్కార్ అగ్రిమెంట్ చేసుకోవడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే నాడు ఎలాన్ మస్క్ తో చంద్రబాబు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక, టెస్లాను ఏపీకి ఆహ్వానిస్తూ కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం జగన్ విజన్ కు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.