పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను జగన్ సర్కార్ వెంటాడుతోంది. ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పాత ధరలకే టికెట్లు విక్రయించాలంటూ తేల్చి చెప్పారు.
దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భీమ్లా నాయక్ చిత్ర ప్రదర్శనలను ధియేటర్ల యజమానులు నిలిపివేశారు. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ప్రభుత్వం నుంచి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని సినీ ప్రముఖులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం వేసిన కమిటీతో పాటు సీఎం జగన్ను కలిసి సినిమా సమస్యలు, టికెట్ల రేట్లపై చర్చించారు. అయినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.
ఇదిలావుంటే.. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా స్పందించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారని అన్నారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తులను టార్గెట్ గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.
భారతీ సిమెంట్ రేటు పై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమా పై ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్…తన మూర్ఖపు వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి…థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న మన వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే….ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారని చంద్రబాబు దెయ్యబట్టారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుందని,..నిలదీస్తుం